అగ్రరాజ్యం అమెరికాలో హైదరాబాదీ మూలాలున్న వ్యక్తి సత్తా చాటారు. తాజాగా
జరిగిన ఎన్నికల్లో మరోసారి విజయం సాధించారు. దీంతో వరుసగా మూడోసారి సెనేటర్‌గా
ఎన్నికయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ మూలాలు కలిగిన ఇండియన్
అమెరికన్ ముజ్తబా అజీజ్ మహ్మద్.. తాజాగా జరిగిన అమెరికా మధ్యంతర ఎన్నికల్లో
నార్త్ కరోలినా సెనేట్‌కు పోటీ చేశారు. మెక్లెన్బర్గ్ కౌంటీ 38వ డిస్ట్రిక్ట్
నుంచి బరిలోకి దిగిన ఆయన.. వరుసగా మూడోసారి సెనేటర్‌గా ఎన్నికయ్యారు.
డెమొక్రటిక్ పార్టీ తరఫున పోటీ చేసిన మహ్మద్.. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిని
ఓడించారు. ఇదిలా ఉంటే.. ముజ్తబా అజీజ్ మహ్మద్ తల్లిదండ్రులు అజీజ్ హసన్
జావెద్, ఖమర్ మహ్మద్.. 1980ల్లో అమెరికాకు వలస వెళ్లారు. ఈ దంపతులకు 1985
జూన్‌లో ముజ్తబా అజీజ్ మహ్మద్ జన్మించారు. ఈయన నార్త్ కరోలినా యూనివర్సిటీ
నుంచి డిగ్రీ పట్టా అందుకున్నారు. ఈయనకు భార్య సబాతోపాటు ముగ్గురు పిల్లలు
ఉన్నారు. 1997లో చివరి సారిగా ఈయన హైదరాబాద్‌ను సందర్శించారు.