ట్విట్టర్ లో దేశాధినేతల చమత్కార సందేశాలు
వారాంతంలో ప్రెసిడెంట్ జో బైడెన్, డచ్ ప్రధాన మంత్రి మార్క్ రూట్ ట్విట్టర్
వేదికగా చమత్కార సందేశాలు పంపుకున్నారు. యునైటెడ్ స్టేట్స్ ప్రపంచ కప్ ఆశలకు
నెదర్లాండ్స్ బ్రేక్ వేసింది. దోహాలోని ఖలీఫా ఇంటర్నేషనల్ స్టేడియంలో శనివారం
డచ్ జట్టుతో జరిగిన (చివరి-16గ్రూప్) మ్యాచ్ కు ముందు యుఎస్ జట్టుకు
శుభాకాంక్షలు తెలుపుతూ ట్విట్టర్లో బైడెన్ పోస్ట్ చేసిన వీడియోలో అమెరికన్లు
“దీనిని సాకర్, ఫుట్ బాల్ అంటారు” అన్నారు. అమెరికాపై 3-1 విజయంతో
క్వార్టర్-ఫైనల్లోకి నెదర్లాండ్స్ ప్రవేశించింది. ఈ తరుణంలో జో బైడెన్
ట్వీట్‌కు డచ్ ప్రధాన మంత్రి మార్క్ రూట్ స్పందించారు.