అయోధ్య శ్రీరామ మందిరం ప్రారంభోత్సవం.. స్వామివారి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ వేడుకల నేపథ్యంలో విశ్వ హిందూ పరిషత్ ఓ ఆధ్యాత్మిక గీతాన్ని రూపొందించింది. ఈ గీతాన్ని జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ గురువారం సాయంత్రం హైదరాబాద్ లో ఆవిష్కరించారు. ఈ నెల 22వ తేదీన అయోధ్యలో శ్రీ రామ మందిర ప్రారంభోత్సవం జరగనుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలను శ్రీరాములవారి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఆహ్వానం పలుకుతూ ఈ పాట, అందుకు అనుగుణంగా వీడియోను రూపొందించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్, విశ్వహిందూ పరిషత్ ప్రముఖులు పాల్గొన్నారు.