విజయవాడ : గత మూడు రోజులుగా మధ్య ప్రదేశ్ రాష్ట్రం జబల్ పూర్ పట్టణంలో స్థానిక
సత్య రక్ష కన్వెన్షన్ సెంటర్ (రాంగేయ రాఘవ స్మారక సభా వేదిక) నందు జరుగుతున్న
అఖిల భారత అభ్యుదయ రచయితల సంఘం 18 వ మహాసభలు నేటి సాయంత్రంతో ముగిశాయి. వివిధ
రాష్ట్రాల నుండి పాల్గొన్న ప్రతినిధులు చర్చల్లో పాల్గొన్నారు. పలు పుస్తకాలను
ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మణిపూర్ రాష్ట్రంలో సాగుతున్న హింసాకాండ నివారణ,
శాంతిని నెలకొల్పడంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని, సమాజ ప్రగతిని
కోరుకునే రచయితలకు స్వేచ్చ, రక్షణ కల్పించాలని, జబల్ పూర్ లో నిర్మితమవుతున్న
అణు కర్మాగారాన్ని తక్షణమే నిలిపివేయాలని తీర్మానం చేశారు. కవులు రచయితలు తమ
కలం గళానికి మరింతగా పదును పెట్టాలని , కార్ల్ మార్క్స్, అంబేత్కర్ ఆలోచన
విధానంతో సాహిత్యం రావాలని, సామాజిక సమస్యకు అద్దం పట్టే సాహిత్యం రావాలని,
క్రొత్త తరం రచయితలను ప్రొత్చహించాలని పలువురు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

నూతన అధ్యక్షునిగా పెనుగొండ : అరసం ఆలిండియా కమిటీ నూతన అధ్యక్షునిగా
గుంటూరు కు చెందిన సీనియర్ న్యాయవాది పెనుగొండ లక్ష్మినారాయణ ఎన్నికవ్వగా,
ప్రధాన కార్యదర్శిగా సుఖ దేవ్ సింగ్ శిర్శా మరొకసారి ఎన్నికయ్యారు. జాతీయ
కార్యదర్శిగా తెలంగాణ రాష్ట్రం నుండి వేల్పుల నారాయణ , కార్యవర్గ సభ్యులుగా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రాచపాళెం చంద్రశేఖరరెడ్డి,
వల్లూరి శివప్రసాద్ లు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఏపి ప్రతినిధులు ఏ ఎమ్ ఆర్
ఆనంద్, బొల్లినేని నాగార్జున సాగర్, మోతుకూరి అరుణ కుమార్, శిఖా ఆకాష్,
బంగారు. ఆచార్యులు, ఉప్పల అప్పలరాజు చెరుకుపల్లి సింగా తదితరులు పెనుగొండను,
ఘనంగా సత్కరించారు.