ఎస్టీ కార్పొరేషన్ ను పూర్తిగా నిర్వీర్యం చేశారు
రూ.5,355 కోట్ల ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను దారిమళ్లించిన గిరిజన ద్రోహి జగన్
రెడ్డి
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
1900 కిలోమీటర్ల మజిలీకి చేరుకున్న యువగళం పాదయాత్ర
ధాన్యం ఆరబోత ఫ్లాట్ ఫారాల నిర్మాణానికి లోకేష్ శిలాఫలకం
కోవూరు : రాష్ట్రంలో అరాచకపాలనను అంతమొందించడమే లక్ష్యంగా యువగళం పాదయాత్ర
చేపట్టానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. జన
ప్రభంజనంగా మారి లక్ష్యం దిశగా దూసుకుపోతోంది. కోవూరు నియోజకవర్గం సాలుచింతలలో
పాదయాత్ర ఈరోజు 1900 కి.మీ. మైలురాయిని చేరుకోవడం సంతోషంగా ఉంది. అధికారంలోకి
వచ్చాక రైతులు పండించిన ధాన్యాన్ని ఆరబెట్టుకోవడానికి కోవూరు
నియోజకవర్గవ్యాప్తంగా ప్లాట్ ఫారాలు నిర్మిస్తానని హామీ ఇస్తూ, శిలాఫలకాన్ని
ఆవిష్కరించాను. దీనివల్ల ఈ ప్రాంత వరి రైతాంగం పండించిన ధాన్యం నాణ్యత
మెరుగుపడి మార్కెట్ లో మంచి ధరకు విక్రయించుకోవడానికి అవకాశం కలుగుతుంది.
నారా లోకేష్ ను కలిసిన కోవూరు రైతులు : కోవూరుకు చెందిన రైతులు యువనేత నారా
లోకేష్ ను కలిసి వినతి పత్రం అందించారు. సాగునీటికి తీవ్ర ఇబ్బందులు
ఎదుర్కొంటున్నామని, సాగునీటి నీటి సమస్యకు పరిష్కారానికి లిఫ్ట్ ఇరిగేషన్
ఏర్పాటు చేయాలని కోరారు. పెన్నానది నుంచి గొలుసుకట్టు చెరువులకు నీరు సరిగా
అందక తాగు, సాగు నీటికి ఇబ్బందిగా ఉందని, ప్రస్తుత ప్రభుత్వానికి ఎన్ని
అర్జీలు పెట్టినా లాభం లేకుండా పోయిందని, మీరు అధికారంలోకి రాగానే మా సమస్య
పరిష్కరించాలన్నారు. నారా లోకేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి
అధికారంలోకి వచ్చాక ఇరిగేషన్ వ్యవస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, టిడిపి
ప్రభుత్వ హయాంలో సాగునీటి ప్రాజెక్టులు, వనరులపై రూ.68,294 కోట్లు
ఖర్చుచేస్తే, జగన్ వచ్చాక అందులో నాలుగోవంతు కూడా ఖర్చుచేయలేదన్నారు. టిడిపి
అధికారంలోకి రాగానే లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటుచేసి కోవూరు ప్రజల సాగు, తాగునీటి
సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని, రాష్ట్రంలో రైతాంగ సంక్షేమానికి
తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందన్నారు.
లోకేష్ ను కలిసిన మీ-సేవ ఉద్యోగులు : కోవూరు నియోజకవర్గం మండబయలు గ్రామంలో
మీ-సేవ సిబ్బంది యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ప్రజలకు
మెరుగైన సేవలందించాలన్న ఉద్దేశంతో 2003లో చంద్రబాబునాయుడు మీ-సేవ వ్యవస్థను
ప్రారంభించారని, గత 19 సంవత్సరాలుగా 139రకాల సేవలను మీ-సేవ కేంద్రాలద్వారా
ప్రజలకు అందిస్తున్నామని, ప్రస్తుతం మాకు రూ.8వేలు మాత్రమే వేతనంగా
ఇస్తున్నారు, ఉద్యోగ భద్రత లేదన్నారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక
2020 మార్చి నుంచి రామ్ ఇన్ఫోటెక్ వారు మాకు ఇవ్వాల్సిన జీతాలు, పిఎఫ్, ఈఎస్ఐ
చెల్లించడం లేదని, సచివాలయ వ్యవస్థ రాకతో మీ-సేవలు కూడా నిలచిపోయాయన్నారు.
దీర్ఘకాలంగా జీతాల్లేక, వేరే ఉద్యోగాలు చేయలేక తీవ్ర ఇబ్బందులు
ఎదుర్కొంటున్నామని, మీరు అధికారంలోకి వచ్చాక మాకు న్యాయం చేయాలన్నారు. నారా
లోకేష్ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన పౌరసేవలను అందించాలన్న ఉద్దేశంతో
చంద్రబాబునాయుడు మీ-సేవ వ్యవస్థను ఏర్పాటుచేశాని, దీర్ఘకాలంగా సేవలందిస్తున్న
ఈ వ్యవస్థను జగన్ అధికారంలోకి వచ్చాక నిర్వీర్యం చేశారన్నారు. వేలాదిమంది
మీ-సేవ కేంద్రాల్లో పనిచేసే సిబ్బంది జీవితాలను అగమ్యగోచరంగా మార్చారని,
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే మీ-సేవ వ్యవస్థను మరింత సమర్థవంతంగా
వినియోగించుకుని ప్రజలకు మెరుగైన సేవలందిస్తామని, మీ-సేవ ఉద్యోగులకు
న్యాయబద్ధంగా రావాల్సిన బకాయిలను అందజేసి, వారికి ఉద్యోగ భద్రత
కల్పిస్తామన్నారు.
నారా లోకేష్ ను కలిసిన యానాది సామాజికవర్గీయులు : కోవూరు నియోజకవర్గం
గుమ్మలదిబ్బ ఎస్టీ కాలనీలో యానాది సామాజికవర్గీయులు యువనేత లోకేష్ ను కలిసి
వినతిపత్రం సమర్పించారు. గత ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు రుణాలు ఇచ్చింది. కానీ
ఈ ప్రభుత్వం వచ్చాక ఎటువంటి రుణాలు ఇవ్వడం లేదని, గత ప్రభుత్వం ఎస్టీ సబ్
ప్లాన్ కింద రుణాలు, ప్రత్యేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసేది. ఈ
ప్రభుత్వంలో ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు కేటాయించడం లేదన్నారు. యానాదుల
అభివృద్ధికి గతంలో ఇన్నోవా కార్లు, ట్రాక్టర్లు, పంపుసెట్లు వంటివి అందాయి..ఈ
ప్రభుత్వం వచ్చాక వాటిని మాకు ఇవ్వడం లేదని, గతంలో ఉచిత విద్యుత్ మాకు
అందేది..ఎరువులు కూడా అందేవి. విద్యుత్ ఛార్జీలు పెంచడంతో ప్రస్తుతం బిల్లు
కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఇటీవల కాలం నుండి యానాదులపై కారణం లేకుండా
దాడులు చేస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని, ఎస్టీ విద్యార్థులకు స్కాలర్
షిప్ లు అందేవి..కానీ ఇప్పుడు లేవు. మీరు అధికారంలోకి వచ్చాక మాకు న్యాయం
చేయాలని కోరారు. నారా లోకేష్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక
ఎస్టీ కార్పొరేషన్ ను పూర్తిగా నిర్వీర్యం చేశారు. అధికారంలోకి వచ్చాక
రూ.5,355 కోట్ల ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను దారిమళ్లించిన గిరిజన ద్రోహి జగన్
రెడ్డి అని ఆరోపించారు. కాసుల్లేని కార్పొరేషన్ ఏర్పాటుచేసి, యానాదులను
మోసగిస్తున్నారని, టీడీపీ హయాంలో ఎస్టీ కార్పొరేషన్ ద్వారా 50 శాతం సబ్సిడీతో
స్వయం ఉపాధి రుణాలు అందించాం. జగన్ సీఎం అయ్యాక 9 సార్లు విద్యుత్ ఛార్జీలు
పెంచి సామాన్యుల నడ్డి విరిచారు. ఎస్టీ యువత ఉన్నత చదువులు చదవుకుండా ఫీజు
రీయింబర్స్ మెంట్ రద్దు చేశాడు. మేము వచ్చాక పీజీ విద్యార్థులకు ఫీజు
రీయింబర్స్ మెంట్ అమలు చేస్తాం. ఎస్టీ సబ్ ప్లాన్ నిధులతో యానాది కాలనీల్లో
మౌలిక సదుపాయాలు కల్పించి, వారి అభివృద్ధికి కృషిచేస్తామని లోకేష్ హామీ
ఇచ్చారు.