కడప : దేశంలో ఎక్కడా లేనివిధంగా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అర్హత ఉన్న
ప్రతి ఒక్కరికీ వంద శాతం సంక్షేమ పథకాలు, ప్రభుత్వ సేవలు అందాలనే
ప్రధాన ఉద్దేశ్యంతో “జగనన్న సురక్ష” అనే కార్యక్రమాన్ని అమలు
చేస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా పేర్కొన్నారు. కడప
నగరంలోని 30, 43, 5వ డివిజన్లలోని సచివాలయాల్లో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి
ఎస్.బి.అంజాద్ బాషా ఆయా డివిజన్ల కార్పొరేటర్లు, అధికారులు, స్థానిక ప్రజా
ప్రతినిధులతో కలిసి “జగనన్న సురక్ష” శిబిరాలను నిర్వహించారు. ఈ సందర్బంగా
సర్వీస్ రిక్వెస్ట్ స్పాట్ రిజిస్ట్రేషన్, దరఖాస్తుల పరిశీలన
కౌంటర్లను ఆయన పరిశీలించి శిబిరానికి హాజరైన స్థానిక ప్రజలలను పలకరించి
ప్రభుత్వ సేవల గురించి అడిగారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్ బి
అంజాద్ బాషా మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో అర్హత ఉన్న ఏ
ఒక్కరి నోటా కూడా ప్రభుత్వ పథకాల ఫలాలు అందలేదనే మాట రాకూడదని అధికారులకు,
స్థానిక ప్రజా ప్రతినిధులను ఆదేశించారు. “జగనన్న సురక్ష” కార్యక్రమం
ద్వారా ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పథకాలు, సేవలు అందించేలా చర్యలు
చేపట్టాలన్నారు. గత వారం రోజులుగా జిల్లాలోని అన్ని సచివాలయాల పరిధిలో
వాలంటీర్లు ఇంటింటి సర్వే చేసి.. అవసరమైన సేవలకు సంబంధించి దరఖాస్తులు
స్వీకరించారన్నారు. వాటిని సచివాలయాల వారీగా “జగనన్న సురక్ష”
శిబిరాల్లో పరిష్కరిస్తున్నారని తెలిపారు. ఇందుకోసం తహసీల్దార్, ఎంపీడీవో
ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయన్నారు. వైఎస్సార్ చేయూత,
వైఎస్సార్ ఆసరా, జగనన్న అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన ఇలా వివిధ
పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. ఈ పథకాలు ఇప్పటికే
99 శాతానికి పైగా లబ్ధిదారులకు చేరవయ్యాయని, వివిధ కారణాల వల్ల పథకాలు
అందకుండా మిగిలిపోయిన వారికి కూడా పథకాలు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం
ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోందని తెలిపారు. సురక్ష శిబిరాలలో కుల, ఆదాయ
ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ కార్డు, రేషన్ కార్డ్ లలో చేర్పులు మార్పులు
తదితరాలకు సంబంధించి పలు రకాల సర్టిఫికెట్లను ఉచితంగా అందిస్తున్నట్లు
తెలిపారు. జగనన్న సురక్ష కార్యక్రమంలో ప్రజల వద్దకే పరిపాలనను
తీసుకెళ్లి ప్రభుత్వ పథకాలు, సేవలు అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం
అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న ఈ కార్యక్రమాన్ని ప్రజలు
సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ నెల 30వ తేదీ వరకు “జగనన్న సురక్ష” కార్యక్రమం జరుగుతుందని…
ఇంకా ఏవైనా సందేహాలు ఉంటే.. 1902 నంబరుకు కాల్ చేసి “జగనన్నకు చెబుదాం”
ద్వారా ఎవరూ ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేకుండా తమ విజ్ఞప్తులను
నమోదు చేసుకోవచ్చన్నారు.
ప్రజా శ్రేయస్సు కోసం.. జగనన్న సురక్ష కార్యక్రమాన్ని విజయవంతంగా
ముందుకు తీసుకెళ్తూ.. మద్దతిస్తున్న అధికారులకు, స్థానిక
ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో
భాగస్వాములవుతున్న అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు ప్రతి
ఒక్కరికీ అభినందనలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. తొలుత 30వ, 43, 5
డివిజన్ పరిధిలలోని కార్పొరేటర్లు షేక్ మహమ్మద్ షఫీ, రెడ్డి ప్రసాద్, బండి
ప్రసాద్ లు “జగనన్న సురక్ష” కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్. బి.
అంజాద్ బాషా, నగర మేయర్ కె. సురేష్ బాబు లకు ఘనంగా స్వాగతం పలికి సత్కరించి
కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. 43వ డివిజన్ పరిధి రవీంద్రనగర్
ప్రాంతంలో రెండు బ్రిడ్జి ల నిర్మాణానికి మంజూరు అయినందుకు అక్కడి
కార్పొరేటర్, ప్రజలు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్.బి అంజాద్ భాషకు ఘనంగా
సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఐ సీడీఎస్ పిడి శ్రీలక్ష్మి, ఎన్నికల విభాగం
అధికారి శివా రెడ్డి, స్థానిక కార్పొరేటర్లు, మార్కేట్ యార్డు వైస్ చైర్మన్
ఇబ్రహీం మియా, నాయకులు నరపురెడ్డి సుబ్బారెడ్డి, తోట కృష్ణ, జమాల్ బాషా,
సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.