విశ్రాంతి లేకుండా పనిచేసినపప్పుడు శారీరక శ్రమ, మానసిక శ్రమ పెరిగి అలసట అనే
భావన కలుగుతుంది. తీసుకునే ఆహారం, జీవనశైలిపై అలసట అనేది ఆధారపడుతుంది.
* ఎక్కువగా నీరు:
అలసట దరి చేరనీయకూడదంటే నీరు ఎక్కువగా తాగాలి. నీరు ఎక్కువగా తాగడంతో
రక్తప్రసరణ మెరుగుపడుతుంది. మెదడు చురుకుగా పనిచేస్తుంది. రోజుకి కనీసం నాలుగు
లీటర్ల నీటిని తాగాలి.
* అల్పాహారం:
అల్పాహారం తినడంతో శరీరానికి కావాల్సిన శక్తి లభిస్తుంది. టిఫిన్ తినకపోవడంతో
త్వరగా అలసిపోతాం. ఉదయం అల్పాహారం తినకపోవడంతో శక్తిహీనంగా మారుతారు.
* ఉపవాసాలు వద్దు:
ఎక్కువగా ఉపవాసాలు ఉండటం, అనవసర సమయాల్లో ఉపవాసాలు చేయడం మంచిది కాదు. పదిహేను
రోజులకు లేదా నెలకు ఒకసారి ఉపవాసం చేయడం మంచిదే కానీ వారానికి రెండు, మూడు
సార్లు ఉపవాసాలు చేయడం మంచిది కాదు.
* మధ్యాహ్న భోజనం:
శరీరం చురుకుగా పనిచేయాలన్నా, అలసటను దూరం చేసుకోవాలన్నా మధ్యాహ్నం భోజనం
సరిగా చేయాలి. మధ్యాహ్న భోజనంలో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు ఎక్కువగా ఉండేలా
చూసుకోవాలి.
* ఎక్కువగా తినొద్దు:
అధికంగా తినడం కూడా అలసటకు కారణం అవుతుంది. ఎక్కువ కేలరీలు ఉండే ఆహారం తినడంలో
కొవ్వు పేరుకుపోతుంది. దీంతో చురుకుదనం తగ్గి ఆయాసం, అలసట పెరిగిపోతాయి.
* ఐరన్:
తినే ఆహారంలో ఐరన్ కంటెంట్ ఉండేలా చూసుకోవాలి. ఐరన్ లోపం కారణంగా రక్తహీనత
వస్తుంది. రక్తహీనత అలసటకు కారణం అవుతుంది. తోటకూర, గోంగూర, పాలకూర,
మెంతికూరను తినడం ఉత్తమం.
* విటమిన్ సి:
ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో విటమిన్ సి సహాయపడుతుంది. విటమిన్ సి ఆహారాలు
తినడంతో రోగనిరోధకశక్తి మెరుగుపడుతుంది. అలసట దరి చేరదు. నిత్యం ఎనర్జీగా
ఉండవచ్చు.
* కెఫిన్:
కెఫిన్ కంటెంట్ ఉన్న పానీయాలు తాగడంతో శక్తి
స్థాయిలు తగ్గుతాయి. కెఫిన్ ఎక్కువగా తీసుకోవడంతో అలసట, ఆందోళన, చిరాకు
పెరుగుతాయి. కావున వీలైనంత వరకు తక్కువ కెఫిన్ ఉన్న పదార్దాలను తీసుకోండి.
దీని వలన అలసట నుండి విముక్తి పొందవచ్చు.