సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో బ్లడ్ స్టోరేజీ యూనిట్లు ఉండాలి
ఎయిడ్స్ రోగులకు ఎక్కడా మందుల కొరత రాకూడదు
మూడు నెలల ముందుగానే మందుల కోసం ఇండెంట్లు పెట్టుకోవాలి
అవసరాన్ని బట్టి స్థానికంగా మందుల్ని కొనుగోలు చేసుకోవాలి
చివరి నిమిషంలో మందుల్లేవనే సాకులు చెప్పొద్దు
టిఐ ఎన్టీవోల సవితీరుమ సమీక్షించాలి
మాటికి మారు శాతం హెచ్ఐవి టెస్టులు చేపట్టాలి
జిల్లాల్లో డిపిఎంలు నోడల్ ఆఫీసర్లుగా వ్యవహరించాలి
క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవ పరిస్థితుల్ని తెలుసుకోవాలి
ఎపిశాక్స్ ఎపిడి డాక్టర్ కోటేశ్వరిని ఆదేశించిన ప్రాజెక్ట్ డైరెక్టర్ జె.నివాస్
ఎపిశాక్స్ రాష్ట్ర కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన పీడీ జె.నివాస్
గుంటూరు : రాష్ట్రంలో ఎయిడ్స్ రోగులకు ఎక్కడా మందుల కొరత రావివ్వొద్దని, మూడు
నెలల ముందుగానే ఇండెంట్లు పెట్టుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణా సంస్థ
(ఎపిశాక్స్) ప్రాజెక్టు డైరెక్టర్ కె.నివాస్ ఆదేశి ంచారు. చివరి నిమిషంలో
మందుల్లేవవే పాకులు చెప్పొద్దని స్పష్టం చేశారు. అత్యపరమైనప్పుడు స్థానికంగానే
మందుల్ని కొనుగోలు చేసుకోవాలన్నారు. జిల్లా, ఏరియా ఆసుపత్రుల్లో బ్లడ్
బ్యాంకులు, అన్ని సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో (సిహెచ్సీలు) బ్లడ్ స్టోరేజ్
యూనిట్లు అందుబాటులో ఉండాలన్నారు. ప్రైవేట్ బ్లడ్ బ్యాంకుల నిర్వాహకులు పరిగా
బ్లడ్ క్యాంపులు నిర్వహిస్తున్నదీ లేనిదీ. రికార్డుల్ని సరిగా మెంటెయిన్
చేస్తున్నదీ లేనిది డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్లు(డిపిఎంలు)
పర్యవేక్షించాలన్నారు. ఏ డాదిలో ఎన్ని క్యాంపులు నిర్వహించారన్న సమాచారం
ఉండాలనీ, సేకరించిన రక్తంలో 30 శాతం ప్రభుత్వానికివ్వాలని స్పష్టం చేశారు.
బ్లడ్ బ్యాంకులు, బ్లడ్ స్టోరేజ్ యూనిట్ల వివరాల కోసం డిఎంఇ, ఎపివినిపి
కమీషనర్లకు లేఖలు రాయాలని ఎపిడి డాక్టర్ కోటేశ్వరిని ఆదేశించారు. బాధ్యతల
నిర్వహణ, సవితీరులో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవన్నారు. జిల్లా స్థాయిలో
సరిగా పనిచేయని వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.
తాడేపల్లిలోని ఎపిశాక్స్ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఆయన సమీక్ష
నిర్వహించారు. రాష్ట్ర స్థాయిలో సమీక్షలు నిర్వహించినట్టుగానే జిల్లా స్థాయిలో
డిపిఎంలు సమీక్షలు చేపట్టాలని, జిల్లాల్లో వారే వోడల్ ఆఫీపర్లుగా
వ్యవహరించాలని చెప్పారు. టెస్ట్ లకోసం కిట్లను అందుబాటులో ఉంచుకోవాని, టెస్ట
విషయంలో నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. టెస్టింగ్ కిట్లల వివరాల్ని
ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలన్నారు. సోచ్ మొ బైల్ యాప్ పై శిక్షణ
ఇవ్వాలన్నారు. జిల్లా స్థాయిలో శిక్షణా కార్యక్రమాల్ని రెండు వారాల్లో పూర్తి
చేయాలని ఆదేశించారు. రాష్ట్ర స్థాయిలో బ్యాచ్‌ల వారీగా శిక్షణకు గాను కార్యాచరణ
ప్రణాళికను సిద్ధం చేయాలని ఎపిడికి సూచించారు. జిల్లా స్థాయిలో పనిచేయని
వారిపై పర్యవేక్షించాలని, ఆశించిన ఫలితాల్ని సాధించని వారిపై చర్యలు
తీసుకోవాలని ఎపిడిని ఆదేశించారు.
ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో టెస్టింగ్‌లు సజావుగా నిర్వహించాలని, ప్రైవేట్
మెడికల్ కాలేజీల్లో కూడా టెస్టింగ్ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. గిరిజన
ప్రాంతాల్లో టెస్టుల విషయంలో మరింత శ్రద్ధ తీసుకోవాలన్నారు. జిల్లాల్లో ఎక్కడా
ఖాళీ పోస్టులుండకూడదని, వెనువెంటనే భర్తీ చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా ల్యాబ్
టెక్నీషియన్ల పోస్టులకు ప్రాధాన్యతనిచ్చి ఎప్పటికప్పుడు భర్తీ చేయాలన్నారు.
టెస్టులు ఎక్కడా ఆగిపోయే ప్రసక్తి రాకూడదన్నారు. గ్రామ స్థాయిలో డేటాని
అందుబాటులో ఉంచుకుని, ఎఎన్ఎంల సాయంతో మరింత సమర్థవంతంగా అనుమానితుల్ని
గుర్తించాలన్నారు. వలస వెళ్లేవారి సమాచారాన్ని కూడా అందుబాటులో
ఉంచుకోవాలన్నారు. అవుట్ రీచ్ వర్కర్లు ఎఆర్టీ కౌన్సిలర్లను పర్యవేక్షించేలా
చర్యలు తీసుకోవాలన్నారు. సోచ్ యాప్‌లో వివరాల్ని పొందుపర్చని వారిపై చర్యలు
తీసుకోవాలని ఆదేశించారు. టిఐ ఎన్జీవోలు, ఎఅర్జీ సెంటర్ల కౌన్సిలర్లతో సమీక్షా
సమావేశాల్ని నిర్వహించాలని ఎపిడి డాక్టర్ కోటేశ్వరిని ప్రాజెక్టు డైరెక్టర్
జె.నివాస్ ఆదేశించారు.
నూటికి నూరు శాతం పురోగ తి సాధించాలన్నారు. ఏఆర్టీ సెంటర్లలో డేటా ఎంట్రీ,
మందుల వివరాలపై ఆయన ఆరా తీశారు. ఎఆర్టీ సెంటర్లలో మందుల కొరత ఉండకూడదన్నారు,
మందుల వివరాల్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
క్షేత్ర స్థాయిలో పర్యటించి వాస్తవ పరిస్థితుల్ని తెలుసుకోవాలని ఎపిడిని
ఆదేశించారు. జైళ్లలో టెస్టుల్ని పూర్తి చేయడమే కాకుండా, వారికి కావాల్సిన
మందుల్ని స్థానికంగానే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. టిఐ ఎన్జీవోల
పనితీరు మెరుగుపడాలన్నా రు. జెడి (బేసిక్ సర్వీసెస్) డాక్టర్ కామేశ్వర
ప్రసాద్, జెడి(ఎస్టీఐ) డాక్టర్ మంజుల, ఇన్చార్జ్ జెడి(బ్లడ్ పేఫ్టీ) కిషోర్ ,
జెడి (సిఎస్టీ) డాక్టర్ సుబ్రమణ్యం రెడ్డి తదితరులు సమీక్షా సమావేశంలో
పాల్గొన్నారు.