తమిళ అగ్ర హీరో విజయ్ సరసన తమన్నా జోడీగా నటించిన చిత్రం సుర. 2010లో
విడుదలైన ఈ సినిమా అనుకున్నంత విజయాన్ని అందుకోలేకపోయింది. ఆ చిత్రంలో తన నటన
గురించి తమన్నా మాట్లాడుతూ… ఆ సినిమా నాకు చాలా ఇష్టం. కానీ, అందులో నా నటన
బాగోలేదు. ఆ సినిమాలోని నా నటన నాకే నచ్చలేదు అలాంటి పని ఇంకెప్పుడు చేయను.
చిత్రంలోని కొన్ని సన్నివేశాలు బాగా రాలేదు. పాటలు మాత్రం మంచి విజయాన్ని
అందుకున్నాయి. నేను బాగా నటించని సినిమాలలో ‘సుర’ ఒకటి అంటూ తెలిపింది. ‘ఈ
సినిమా ప్రేక్షకులను మెప్పించదని నాకు చిత్రీకరణ సమయంలోనే అర్ధమయ్యింది. కానీ,
నటీనటులు అంగీకరించిన తర్వాత సినిమాలని ఖచ్చితంగా పూర్తి చేయాల్సిందే. అందుకే
ఆ చిత్రాన్ని ముగించాను. జీవితంలో ఏ విషయం విజయం లేదా వైఫల్యాల గురించి కాదు.
సినిమాలు అనేవి వెలకట్టలేని ఒక కళ. కాబట్టి దానిని మనం ఒక బాధ్యతగా
స్వీకరించాలి. ఆది పనిలో ఒక భాగం’ అని అన్నారు తమన్నా. ప్రస్తుతం ఆమె కీలక
పాత్ర పోషించిన ‘జైలర్’, ‘భోళా శంకర్’ సినిమాలు ఆగస్టులో విడుదలకు సిద్ధంగా
ఉన్నాయి. మలయాళంలో రానున్న ‘బాంద్రా’ చిత్రంతో బిజీగా ఉంది మిల్కీ బ్యూటీ.