స్త్రీపురుషుల బంధాన్ని తెరపై చూపించే క్రమంలో వారి మధ్య ఆకర్షణను పరిధుల
మేరకు సహజంగా చూపించడంలో ఏమాత్రం తప్పులేదని వ్యాఖ్యానించింది కథానాయిక
తమన్నా. ఈమే నటించిన ‘జీ కర్దా’ వెబ్ సిరీస్ ఇటీవలే అమెజాన్ ప్రైమ్ లో విడుదల
అయ్యింది. ఇందులో శృంగార సన్నివేశాలు శృతిమించాయని, తమన్నా తన పాత్ర హద్దులు
దాటి ప్రవర్తించిందనే విమర్శలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ జాతీయ పత్రికకు
ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో తమన్నా ‘జీ కర్ణా’ వెబ్ సిరీస్ గురించి మాట్లాడింది.
కథావిష్కరణలో రొమాంటిక్ సన్నివేశాలు కూడా ఓ భాగమని ఆమె స్పష్టం చేసింది.
తమన్నా మాట్లాడుతూ ‘ప్రేమలో ఉన్న ఓ జంట ప్రయాణాన్ని తెరపై
ఆవిష్కరిస్తున్నప్పుడు వారి మధ్య ఉండే గాఢమైన బంధం గురించి కూడా చెప్పాల్సి
ఉంటుంది. ఆ సన్నివేశాలను కథలో భాగంగానే చూడాలి. ఇంటిమేట్ సీన్స్ నేను ఎక్కడా
హద్దు మీరలేదు. కథకు అవసరం కాబట్టే నటించా’ అని చెప్పుకొచ్చింది. ఏడుగురు
చిన్ననాటి మిత్రుల లైఫ్ జర్నీ నేపథ్యంలో ‘జీ కర్దా’ వెబ్ సిరీస్ ను
తెరకెక్కించారు. అరుణిమా శర్మ దర్శకత్వం వహించారు.