న్యూఢిల్లీ : త్వరలోనే అన్ని వాహనాలు రైతులు తయారు చేసే ఇథనాల్‌తోనే
నడుస్తాయని కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. రైతులు
కేవలం అన్నదాతలే కాదు ఇంధనదాతలు కావాలన్నదే తమ ప్రభుత్వం లక్ష్యమని గడ్కరీ
చెప్పారు. ఆకాశాన్నంటిన పెట్రోల్ ధరలను తగ్గించేందుకు తమ ప్రభుత్వం చర్యలు
చేపడుతోందని కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.
త్వరలోనే అన్ని వాహనాలు రైతులు తయారు చేసే ఇథనాల్‌తోనే నడుస్తాయన్నారు.
రాజస్థాన్‌లోని ప్రతాప్‌గఢ్‌లో భాజపా నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న గడ్కరీ
పలు విషయాలు వెల్లడించారు. 60 శాతం ఇథనాల్, 40 శాతం విద్యుత్ సగటు తీస్తే
లీటర్ పెట్రోల్ ధర రూ.15 అవుతుందన్నారు. రైతులు కేవలం అన్నదాతలే కాదు
ఇంధనదాతలు కావాలన్నదే తమ ప్రభుత్వం లక్ష్యమని గడ్కరీ చెప్పారు. ఇలా చేయడం వల్ల
ప్రజలకు మేలు జరగడమే కాకుండా చమురు దిగుమతులు కూడా తగ్గుతాయన్నారు. దీంతో
రూ.16 లక్షల కోట్ల చమురు దిగుమతుల ఆదాయమంతా రైతులకే వెళ్తుందన్నారు. తద్వారా
గ్రామాలు సమృద్ధిగా మారతాయన్నారు. అందుకోసం ఆగష్టు నెలలో టయోటా కంపెనీ
వాహనాలను ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. ఇన్నోవా సహా అన్ని వాహనాలు రైతులు
తయారు చేసే ఇథనాల్‌తో నడుస్తాయన్నారు.