డక్కిలి : వెంకటగిరి ఎక్స్ ప్రెస్ న్యూస్
డక్కిలి మండలంలో గత కొంతకాలంగా వెలికల్లు, మాధవయపాలెం, దేవుడు వెల్లంపల్లి,ఆల్తురుపాడు, పలుగోడు, చాపలపల్లి, డక్కిలి గ్రామ పంచాయతీలలో వైకాపా కొందరి నాయకులలో నేదురుమల్లిపై అలక భూని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న విషయం అందరికీ తెలిసిందే. అసమ్మతి వర్గంగా భావించుతున్న వారితో నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి సైతం చొరవచూపి నేరుగా మాట్లాడి ఉంటే సమస్య ఎప్పుడో పరిష్కారం అయి ఉండేదని చాలామందిలో అభిప్రాయంగా ఉంది. ఇటీవలనే దేవుడు వెలంపల్లిలో వైకాపా టిడిపి వర్గీయులు గొడవల్లో సైతం వైకాపా స్థానిక నాయకులను పరామర్శించలేదన్న బాధ వారిలో ఉండేది. అయితే గత రెండు రోజుల క్రితం నేదురమల్లి రామ్ కుమార్ రెడ్డి దేవుడు వెలంపల్లి గ్రామంలోని వైకాపా నాయకుల ఇంటికి స్వయంగా వెళ్లి వారిని పరామర్శించి మీకు నేను అండగా ఉంటాను దేనికైనా సిద్ధం అనే సంకేతం మండలంలో వైకాపా నాయకులు శ్రేణులు పెద్ద ఎత్తున సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతానికి భిన్నంగా నాయకులతో అంటి ముట్టినట్టుగా ఉండే నేదు రమల్లి స్వయంగా నాయకులు కార్యకర్తల ఇండ్లకు రావడం శుభ పరిణామం అని, త్వరలో అన్ని సమస్యలు పరిష్కారమై ఐక్యంగా ఎన్నికలలో నేదురుమల్లిని గెలిపించే బాధ్యత మాది అంటున్నారు. నేదురుమల్లి సైతం వాస్తవాలను గ్రహించి లోటుపాట్లను తానే సరిదిద్దుకుంటాను అనే పరిస్థితి వారిలో కనబడుతుంది, అందుకు ఇటీవల పార్టీ నుండి సస్పెండ్ అయిన కలిమిలి రాంప్రసాద్ రెడ్డిని తిరిగి పార్టీలోకి ఆహ్వానించడమే అందుకు ఉదాహరణ. ముందు ముందు నేదురుమల్లి ఎలాంటి వ్యూహాలను రాజకీయ చర్యలు తీసుకుంటారో ఆసక్తి అందరిలో కనబడుతోంది. అసమ్మతి వర్గంలో సైతం మాకు నేదురుమల్లి వద్ద తగిన గౌరవం గుర్తింపు లేకపోవడంతోనే దూరంగా ఉంటున్నామని అంతకుమించి మరో ఉద్దేశం లేదన్నది వారి అంతరాంగం.