తాడేపల్లిగూడెం : అసెంబ్లీ సమావేశాలకు వస్తే గతంలో చేసిన తప్పులపై అధికార
పక్షం ఎమ్మెల్యేలు నిలదీస్తారని భయంతో అసెంబ్లీకి రాకుండా ఎగ్గొట్టడానికే
చంద్రబాబు ఏడుపు డ్రామా ఆడారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవదాయ ధర్మాదాయ శాఖ
మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. తాడేపల్లిగూడెం మండలం కడియద్ద గ్రామంలో
వరుసగా మూడవ రోజు శుక్రవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ
ప్రభుత్వంలో జరిగిన తప్పులపై అసెంబ్లీలో అధికారపక్ష వైసీపీ ఎమ్మెల్యేలు
నిలదీస్తుండడంతో భయపడి అసెంబ్లీ సమావేశాలకు రాకుండా ఎగ్గొట్టడానికి చంద్రబాబు
ఏడుపు డ్రామా ఆడారని మంత్రి కొట్టు ఆరోపించారు. ఇక తెలుగుదేశం పార్టీ గెలిచే
పరిస్థితి లేదని తాను ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి లేదని తెలిసి కూడా
చంద్రబాబు మళ్ళీ ముఖ్యమంత్రి గానే అసెంబ్లీలో అడుగు పెడతానని దొంగ ఏడుపు ఏడ్చి
అసెంబ్లీ సమావేశాలకు రాకుండా ఎగ్గొట్టడానికి ప్రణాళిక రచించారన్నారు. అందులో
భాగంగానే అసెంబ్లీలో ఏడవడం ఎగ్గొట్టడం జరిగిందన్నారు.
గత మూడు రోజులుగా కడియద్ద గ్రామంలో ఇంటింటికి గడపగడపకు వెళుతుంటే సంక్షేమ
పథకాలపై ప్రజలంతా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు అర్హత కలిగి తమకు పథకం
అందలేదని చెప్పినవారు ఒక్కరు కూడా లేరని పేర్కొన్నారు. తన పార్టీని తనను
గెలిపించాలని కోరకుండా తెలుగుదేశాన్ని చంద్రబాబును గెలిపించాలని కోరుతున్న
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఓటు అడిగే నైతిక హక్కు లేదన్నారు. ఆ ఇద్దరూ
కలిసి ఆడుతున్న డ్రామా ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుందని వారిని సమర్థించే
పరిస్థితి లేదన్నారు రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై ఇతర రాష్ట్రాల
నుంచి బృందాలను పంపి వారి వారి రాష్ట్రాల్లో కూడా అమలు చేయడానికి అక్కడి
ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయన్నారు. సంక్షేమ పథకాలు అమలులో ఆంధ్రప్రదేశ్
రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే
దక్కుతుందన్నారు. తెలుగుదేశం అధికారంలో ఉండగా ఇదే బడ్జెట్ ఇప్పుడు అదే
బడ్జెట్ మరి ఈ డబ్బంతా ఆనాడు ఏమైంది అని మంత్రి కొట్టు ప్రశ్నించారు నేడు
ముఖ్యమంత్రి జగన్ ప్రజలకు సంక్షేమ పథకాలు ద్వారా ఆర్థిక లబ్ధి
చేకూరుస్తున్నారన్నారు. ఇటువంటి ముఖ్యమంత్రిని వదులుకోవడానికి ప్రజలు సిద్ధంగా
లేరని మళ్ళీ జగనే ముఖ్యమంత్రి కావాలని అందరూ కోరుకుంటున్నారని మంత్రి కొట్టు
తెలియజేశారు. లోకేష్ పాదయాత్ర చేసినా, పవన్ కళ్యాణ్ వారాహి తో వచ్చినా
ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. గడపగడపకు వెళుతుంటే ప్రజలు ఇదే
చెబుతున్నారని మంత్రి కొట్టు సత్యనారాయణ తన అనుభవాలను వివరించారు. ఈ
కార్యక్రమంలో జడ్పిటిసి ముత్యాల ఆంజనేయులు, వైసీపీ మండల అధ్యక్షుడు
కొమ్ముగూడెం సొసైటీ చైర్మన్ వెలిశెట్టి నరేంద్ర కుమార్, మాజీ జడ్పిటిసి
వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి ముప్పిడి సంపత్ కుమా, ర్ కడియద్ద గ్రామ
సర్పంచ్ ,ఎంపీటీసీ సచివాలయం సిబ్బంది వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.