గుంటూరు : 75వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని రాష్ట్ర అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం ముఖ్య అతిథిగా హాజరై ముందుగా జాతిపిత మహాత్మాగాంధీ చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన పిదప మువ్వన్నెల జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశమంతా 75వ గణతంత్ర దినోత్సవాలను జరుపుకుంటున్న శుభ దినాన ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. రాజ్యాంగ స్పూర్తికి అనుగుణంగా రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతకి ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి పధకాలను చిత్తశుద్ధితో అమలు చేస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ సెక్రటరీ జనరల్ డా.పిపిపికె. రామాచార్యులు, ఉప కార్యదర్శులు సుబ్బరాజు, విజయరాజు,చీఫ్ మార్షల్ డి.ఏడుకొండల రెడ్డి,లీగల్ అడ్వయిజర్ ఎం.చంద్రశేఖర్, పలువురు అసెంబ్లీ అధికారులు, ఉద్యోగులు, ఎస్పిఎఫ్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.