న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక తవ్వకాలు వెంటనే నిలిపివేయాలని నేషనల్
గ్రీన్ ట్రైబ్యునల్ తీర్పు వెలువరించింది. నాగేంద్రకుమార్ దాఖలు చేసిన
పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం రాష్ట్రంలోని 110 ఇసుక రీచ్‌లలో వెంటనే
తవ్వకాలు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు
ఆదేశాలను తీర్పులో పేర్కొన్న ఎన్జీటీ.. గత ఉత్తర్వులు అరణియార్ నదిలోని 18
రీచ్‌లకే పరిమితం కాదని స్పష్టం చేసింది. తమ ఆదేశాలను ఏపీ ప్రభుత్వం
పట్టించుకోవటం లేదని ఎన్జీటీ వ్యాఖ్యానించింది. ట్రైబ్యునల్ తీర్పునకు ఏపీ
ప్రభుత్వం వక్రభాష్యం చెప్పిందని మండిపడింది. రాష్ట్ర పర్యావరణ అంచనా కమిటీ
(సియా) ఆదేశాల తర్వాత ఇసుక తవ్వకాలపై నివేదించాలని ఏపీ ప్రభుత్వాన్ని
ఆదేశించింది. ఇసుక తవ్వకాలపై జేపీ వెంచర్స్ కూడా నివేదిక ఇవ్వాలని ఎన్జీటీ
ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర పర్యావరణ అంచనా కమిటీ ఉత్తర్వులను అమలు
చేయాలన్న ఎన్జీటీ పర్యావరణ అనుమతులు తీసుకునే వరకు తవ్వకాలు చేపట్టరాదని
స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది.