అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రధాన ఎజెండాగా కీలకమైన సమావేశాల్లో పాల్గొనేందుకు సీఎం జగన్ మోహన్ రెడ్డి మంగళవారం సాయంత్రం ఢిల్లీ పయనమయ్యారు. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి విమానంలో ఢిల్లీ బయల్దేరి వెళ్లారు సీఎం జగన్. బుధవారం మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీ కానున్నారు. ఏపీ అభివృద్ధికి రావాల్సిన నిధులతో పాటు పోలవరం, విభజన హామీల గురించి ప్రధానితో సీఎం చర్చించే అవకాశం ఉంది. ఈ నెల మొదటి వారంలో కూడా సీఎం జగన్ ఢిల్లీలో పర్యటించారు. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన G20 సదస్సుకు సంబంధించిన సమావేశంలో పాల్గొన్నారు. ఇటీవల ప్రధానితో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు కూడా సీఎం జగన్ హాజరయ్యారు.