సహృదయులైన మీరు మమ్మల్ని ఆశీర్వదించాలి
కేంద్ర ప్రభుత్వంతో మా అనుబంధం రాజకీయాలకు అతీతమైంది
విశాఖపట్నం : దేశ ప్రగతి రథసారథి నరేంద్ర మోడీ అని, సహృదయంతో ఆంధ్ర ప్రదేశ్ ము అన్ని విధాల ఆదుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరారు. శనివారం విశాఖపట్నం ఏయూ ప్రాంగణంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీతో వేదిక పంచుకున్నారాయన. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ దేశ ప్రగతి రథసారథి ప్రధాని నరేంద్ర మోడీ గారికి స్వాగతం. ఏయూలో జన సముద్రం కనిపిస్తోంది. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న కెరటాల్లా జనం ఇక్కడికి తరలివచ్చారు. వంగపండు పాట ఏం పిల్లడో ఎల్లమొస్తవా అనే పాటలా జనం తరలివచ్చారు. జగన్నాథ రథచక్రాలు ఇక్కడికి కదిలి వచ్చాయి. 10,742 కోట్ల ప్రాజెక్టులు ప్రారంభిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ కి రాష్ట్ర ప్రజలు, అశేష జనం తరఫున ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వంతో మా అనుబంధం రాజకీయాలకు అతీతమైంది. మాకు మరో ఎజెండా లేదు.. ఉండబోదు. రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా పోలవరం నుంచి ప్రత్యేక హోదా వరకూ మీకు చేసిన విజ్ఞప్తులను పరిష్కరించాలని మరోసారి కోరుతున్నాం అన్నారు జగన్.
సహృదయులైన మీరు మమ్మల్ని ఆశీర్వదించాలి : ఈ మూడున్నరేళ్లలో ఏపీ సంక్షేమం, అభివృద్ది దిశగా దూసుకెళ్లింది. విద్య, వైద్యం, సాగు, సామాజిక న్యాయం, మహిళా సంక్షేమం, అభివృద్ధి, సంక్షేమం, గడప వద్దకే పరిపాలన మా ప్రాధాన్యతలు అయ్యాయి. ప్రతి కుటుంబం నిలదొక్కుకునేందుకు మా అర్థిక వ్యవస్థలో ప్రతీ రూపాయి ఖర్చు చేశాం. వీకేంద్రీకరణ, పాదర్శకతతో పాలన కొనసాగిస్తున్నాం. నిలదొక్కుకునేందుకు ఏపీ ప్రయత్నిస్తోంది. కేంద్ర ప్రభుత్వంతో మా అనుబంధం రాజకీయాలకు అతీతం. మాకు మరో ఎజెండా లేదు.. ఉండబోదు. రాష్ట్రాభివృద్ధికి మీ సహాయ సహకారాలు మరింత కావాలి. విభజన గాయం నుంచి ఏపీ ఇంకా కోలుకోలేదు. పెద్దలు సహృదయులైన మీరు ధానిని ఉద్దేశిస్తూ) మమ్మల్ని ఆశీర్వదించాలి. ఏపీని తగిన విధంగా కేంద్రం ఆదుకోవాలి. మీకు చేసిన విజ్ఞప్తులను పరిష్కరించాలని మరోసారి కోరుతున్నాం అని సీఎం జగన్ ప్రధాని సమక్షంలోనే విజ్ఞప్తి చేశారు.
ఈ మూడేళ్లలో ప్రజలకు అనుకూలంగా ఎన్నో చేశాం. మహిళలకు సాధికారత, విద్య, వైద్యం, గ్రామ సచివాలయాలు వంటి కార్యక్రమాల్లో ఎంతో అభివృద్ధిని సాధించాం. గడప వద్దకే పాలన ప్రాధాన్యతగా అడుగులు ముందుకు వేస్తున్నాం. ఏపీకి మీరు పెద్ద మనసుతో ఎంతో చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంతో, ముఖ్యంగా మీతో మాకు ఉన్న అనుబంధం ఎంతో బలమైనది. కేంద్రంతో మా అనుబంధం రాజకీయాలకు అతీతమైనది. రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా పోలవరం ప్రాజెక్టు, ప్రత్యేక హోదా రైల్వే జన్ వంటి వాటిపై మేము పలుమార్లు చేసిన విన్నపాల పట్ల సానుకూలంగా స్పందించాలని కోరుకుంటున్నా. రాష్ట్రానికి మీరు చేసే ప్రతి సాయం, ఇచ్చే ప్రతి సంస్థ, ప్రతి రూపాయి మా అభివృద్ధికి దోహదపడతాయి. పెద్దలైన మీరు మమ్మల్ని ఆశీర్వదించాఅని ముఖ్యమంత్రి జగన్ కోరారు.