విజయవాడ : రాష్ట్ర విభజన చట్టాన్ని లోక్‌సభలో ఆమోదించి నేటికీ 9 సంవత్సరాలు
గడిచాయని, నేటి వరకు విభజన చట్టంలోని అంశాలను అమలు చేయకపోవడం దుర్మార్గం అని
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో
విద్యార్థి నాయకులతో సమావేశం నిర్వహించి విభజిత ఆంధ్రప్రదేశ్‌కు నేడు ఒక
దుర్దినమని ఆరోపించారు. వచ్చే నెలలోపు రాష్ట్ర ప్రభుత్వం విభజన హామీల అమలు,
హోదా సాధనపై స్పష్టమైన వైఖరి చెప్పాలి. లేదంటే చలో అసెంబ్లీ కార్యక్రమం
చేపడతామని తెలిపారు. రాష్ట్ర విభజన చట్టాన్ని లోక్‌సభలో ఆమోదించి నేటికీ 9
సంవత్సరాలు గడిచాయని నేటి వరకు విభజన చట్టంలోని అంశాలను అమలు చేయకపోవడం
దుర్మార్గం అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నారు. ప్రత్యేక
హోదా, విభజన హామీలను అమలు చేయాలనీ డిమాండ్ చేస్తూ విజయవాడలో చేపట్టిన సమర
యాత్రలో పాల్గొన్న విద్యార్థి నాయకులతో సమావేశం నిర్వహించారు. విభజిత
ఆంధ్రప్రదేశ్‌కు నేడు ఒక దుర్దినమని అన్నారు. విభజన హామీలు అమలు చేయకపోయినా,
రాష్ట్ర ప్రభుత్వం, ఎంపీలు ఏమీ పట్టనట్లు ఉంటున్నారే కానీ ప్రశ్నించడంలేదని
మండిపడ్డారు.
విభజిత ఆంధ్రప్రదేశ్‌కు నేడు ఒక దుర్దినం
రాష్ట్రంలో పరిశ్రమలు పెడితే ఉపాధి వస్తుంది. యువతకు మంచి భవిష్యత్తు
దొరుకుతుంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వను అంటే పరిశ్రమలు పెట్టకుండా ఉపాధి
కల్పించకుండా ఉండటం, ఏపీని ముంచడం లాంటిదే నన్నారు. ఆంధ్రప్రదేశ్ యువత
భవిష్యత్తు నిలువునా ముంచడం లాంటిదే ప్రత్యేక హోదా ఇవ్వనంటే ప్రభుత్వానికి
ఇబ్బంది లేకుండా వ్యవహరించమని పార్లమెంట్ సభ్యుడు భరత్ మొన్న బహిరంగంగా
చెప్పాడు. అంటే నరేంద్ర మోడీ కి ఏ మాత్రం ఇబ్బంది కలగకుండా చూసుకోమని
చెప్పారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు అన్నారు.