రాశారు
పత్రికా స్వేఛ్చ అంటూ ఇతరుల స్వేఛ్చను హరించే హక్కు రామోజీరావుకు లేదు
గుంటూరు ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టులో పరువునష్టం దావా కేసు వేశాం.
ఈ కేసులో రామోజీరావు, ఆయన కుమారుడు కిరణ్, శైలజాకిరణ్,ఏపి,తెలంగాణా ఈనాడు
ఎడిటర్,బ్యూరోఛీఫ్ లు బాధ్యులుగా ఉన్నారు
గుంటూరులో వేసిన పరువునష్టం దావాపై వివరాలు వెల్లడించిన ప్రభుత్వ అదనపు
అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకరరెడ్డి
గుంటూరు : చట్టానికి వ్యతిరేకంగా అక్రమవ్యాపారం చేస్తున్న మార్గదర్సి చిట్స్
సంస్ద పై ప్రభుత్వ దర్యాప్తు సంస్ధ సిఐడి విచారిస్తే ఆ అంశంపై ఈనాడులో
దుర్మార్గమైన తప్పుడు రాతలు రాశారు.తప్పుడు రాతలపై గుంటూరు ప్రిన్సిపల్
సెషన్స్ కోర్టులో పరువు నష్టం దావా వేసినట్లు ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్
పొన్నవోలు సుధాకరరెడ్డి వెల్లడించారు. గుంటూరు కోర్టులో కేసు దాఖలు చేసిన
అనంతరం అందుకు సంబందించిన వివరాలను మీడియాకు వివరించారు. ఈ కేసులో రామోజీరావు,
ఆయన కుమారుడు కిరణ్, శైలజా కిరణ్, ఏపి,తెలంగాణా ఈనాడు ఎడిటర్లు బాధ్యులుగా
ఉన్నారని తెలియచేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఈనాడు తప్పుడు రాతలు రాసిన
అంశంపై రామోజీ రావును కోర్టులో నిలబెడతామని వివరించారు. దానికి సంబంధించిన
వివరాలు ఇలా ఉన్నాయి. మార్గదర్శి చిట్స్ సంస్ధ రాష్ర్టంలోనే కాక ఇతర
ప్రాంతాలలో అక్రమ వ్యాపారం చేస్తోంది.ఈ విషయాన్ని రూడి చేసుకున్న సిఐడి అక్రమ
వ్యాపారంపై దర్యాప్తు ప్రారంభించింది.ఆ విధంగా దర్యాప్తు చేయడం ఏమాతరం
సహించలేని రామోజీరావు తనకున్న ఈనాడు,ఈటివి మీడియా సంస్దల ద్వారా సిఐడిపై
తప్పుడు రాతలు రాసి విషం చిమ్మడం ప్రారంభించిందన్నారు. మీడియా ముసుగులో
రామోజీరావుకు చెందిన ఆ సంస్ధలు సిఐడిపై,ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై అసత్యాలు
రాయడం ప్రారంభించిందన్నారు. ప్రధానంగా అక్రమ వ్యాపారం ఈ దర్యాప్తు కారణంగా
బయటపెట్టారనే అక్కసుతో, దురుధ్దేశ్యంతో ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు ఈ
రాతలు రాశారని ఆరోపించారు. మార్గదర్శిపై విచారణ చేసేవారిని భయభ్రాంతులకు
గురిచేసే రీతిలో వారి రాతలు ఉన్నాయని అన్నారు. పత్రికా స్వేఛ్చ అంటూ ఇతరుల
స్వేఛ్చను హరించే హక్కు రామోజీరావుకు లేదని అన్నారు.వారు ఆ విధంగా ఎందుకు
సిఐడిని,ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసేవిధంగా ఎందుకు ప్రవర్తించాల్సి వచ్చిందో
కోర్టుకు వచ్చి సమాధానం చెప్పితీరాలన్నారు. న్యాయవ్యవస్ధ దేశంలోనే
అత్యున్నతమైందని దానికన్నా ఎవరూ అతీతులు కారని అన్నారు. ఈ విధంగా ప్రభుత్వంపై
విమర్శల రూపంలో దాడులకు పాల్పడుతున్నారో వారిపై చట్టపరమైన చర్యలు తప్పనిసరిగా
ఉంటాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కాని,తమకుగాని వ్యక్తిగతంగా
ఎవరిపై కక్ష లేదన్నారు. ప్రధానంగా తాము అక్రమ వ్యాపారం చేస్తాం. తమను
న్యాయవ్యవస్ధ గాని,ప్రబుత్వం గాని, దర్యాప్తు సంస్ధలు గాని ప్రశ్నించకూడదు.
కేసులు పెట్టకూడదు అనే భావనలో రామోజీరావు, మార్గదర్శి యాజమాన్యం ఉందన్నారు.
అవన్నీ కూడా వారి పత్రికలలో, టివిలలో వార్తల రూపంలో కనిపిస్తున్నాయన్నారు.
విచిత్రమైన వాదన ఏమిటంటే తమ సంస్ధ మార్గదర్శిపై ఏ ఏఓక్కరూ ఫిర్యాదు చేయలేదు
కాబట్టి కేసు ఎలా నమోదు చేస్తారని వారు ప్రశ్నిస్తున్నారన్నారు. అయితే
చట్టానికి సంబంధించి ఎవ్వరూ ఫిర్యాదు చేయకపోయినా అక్రమం అని ప్రభుత్వంగాని,
దర్యాప్తు సంస్ధగాని గుర్తిస్తే ప్రజలకు నష్టం జరగకూడదనే దిశగా చర్యలు
చేపట్టవచ్చని అన్నారు. ఏ ప్రభుత్వం ఉన్నా తమ అడుగులకు మడుగులొత్తాలనే ద్యేయంతో
రామోజీరావు పనిచేస్తున్నారని విమర్శించారు. ఈనాడు సంస్ధలకు కర్త,కర్మ,క్రియ
అయిన రామోజీరావు,ఆయన కుమారుడు కిరణ్, శైలజా కిరణ్, ఈనాడు ఎడిటర్
నాగేశ్వరరావు,బ్యూరోఛీఫ్ లు బాధ్యులుగా అఫెన్స్ రెడ్ విత్ 120 బి ఐపిసి,109
ఐపిసి సెన్ 500, 501, 502 కింద కేసు వేయడం జరిగిందన్నారు. ఈనాడు రాతలు
అధికారులను, ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేసే విధంగా, ప్రజల మనస్సులను
కలుషితం చేసే విధంగా,ప్రజలు ఎన్నుకున్న వ్యవస్ధలను లెక్కచేయని విధంగా
ఉన్నాయన్నారు.రాజ్యాంగ వ్యవస్దను సైతం లెక్కచేయని రీతిలో ఉన్నాయన్నారు.
మార్గదర్శిపై సిఐడి దర్యాప్తు ప్రారంభించగానే ఈనాడులో బ్యానర్ ఐటమ్ ఏంటంటే
‘మార్గదర్సిపై సిఐడి భారీ కుట్ర’ అని ప్రచురించారన్నారు. టీవీ లలో సైతం
డిబేట్స్ పెట్టి సీఐడీ, ఏపీ ప్రభుత్వం పై వ్యతిరేక ప్రచారం చేశారన్నారు.అంటే ఈ
రాతలు ద్వారా దర్యాప్తు అధికారులను భయపెట్టాలనుకున్నారా. చట్టానికి తాము
అతీతులం అని భావిస్తున్నారా అని సుధాకరరెడ్డి ప్రశ్నించారు. పత్రికా స్వేఛ్చ
ముసుగులో ప్రభుత్వ,ప్రజల స్వేఛ్చను హరిస్తానంటే రామోజీరావును ప్రభుత్వం తరపున
చట్టపరంగా కోర్టులో నిలబెట్టి తీరతామని తెలియచేశారు.