అమరావతి : ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడుగా కొనసాగుతున్న డాక్టర్ ఎన్ . మారేశ్ కు రాజ్యాంగ బద్ధమైన బీసీ కమిషన్ మెంబర్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. ఈ నియామకం పట్ల
డాక్టర్ ఎన్.మారేశ్ స్పందిస్తూ తనపై నమ్మకం ఉంచి బీసీ కమిషన్ మెంబర్ గా అవకాశం కల్పించినందుకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
తనతోపాటు మరో ఇద్దరు జె.శేష చలపతి, కుందుర్తి గుర్వా చారిని బీసీ కమిషన్ మెంబర్లుగా నియమిస్తూ మంగళవారం సంక్షేమ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జి అనంతరాము ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు. బీసీ నాయకుడిగా నాకు గుర్తింపునిచ్చి ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా చేసిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ .కృష్ణయ్యకు, వైసీపీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, వై.వీ సుబ్బారెడ్డి, విజయ సాయి రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. బీసీ కమిషన్ ఆశయాలకు అనుగుణంగా, బీసీల రిజర్వేషన్లు పరిరక్షణ కోసం బీసీల హక్కులు, బీసీలకు విద్యా ఉద్యోగాల్లో లభిస్తున్న రిజర్వేషన్ల కోసం కమిషన్ పరిధిలోని అధికారంలో ఉపయోగించుకుని, విధులు నిర్వహిస్తానని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణనలో 139 బీసీ కులాలు పాల్గొనాలని కోరారు.
బీసీలకు రక్షణ కవచంగా ఆంధ్రప్రదేశ్ బీసీ కమిషన్ పనిచేస్తుందని స్పష్టం చేశారు