విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగుల సమస్యలపై
ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి ఏపీ జెఎసి అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు
ఇచ్చిన కార్యాచరణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం
పాల్గొనడం లేదని రాష్ట్ర అధ్యక్షులు భూపతిరాజు రవీంద్ర రాజు. ప్రధాన
కార్యదర్శి ఎం. అప్పలనాయుడు తెలిపారు. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి
ఉద్యోగి, ఉద్యోగ సంఘ నాయకుల మీద నమ్మకం లేక చాలాఅసంతృప్తిగా ఉన్నారన్నారు.
ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్న, ఏపీ జేఏసీ అమరావతి పేరుతో ఇచ్చిన ఉద్యమ
కార్యచరణ వల్ల, ఎంతవరకు ఉద్యోగులకు న్యాయం జరుగుతుందని ఆలోచిస్తున్నారని
పేర్కొన్నారు. ఎందుకంటే గతంలో పి. ఆర్. సి .ఉద్యమంలో దేశ చరిత్రలోనే
విజయవాడలో ప్రతి ఉద్యోగి పాల్గొనడం జరిగింది. కానీ ఉద్యోగ సంఘాల పేరుతో ఏ
ఉద్యోగికి న్యాయం జరగలేదు. ఎప్పుడు లేని విధంగా 27శాతం ఐ ఆర్. తీసుకుంటూ ఉంటే
రివర్స్ లో 23శాతం ఫిట్మెంట్ ప్రభుత్వము ఇస్తే, అప్పుడు ప్రశ్నించకుండా ఉండడం
వాళ్ళ ఇప్పటివరకు వాటికి సంబంధించి ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు కూడా
ఇవ్వకపోయినా కొన్ని ఉద్యోగ సంఘాలు వారి యొక్క సొంత ప్రయోజనాల కోసం మరల
ఉద్యోగులను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
దీన్ని ఉద్యోగస్తులు ఎవరు నమ్మే పరిస్థితులు లేరని, వీరిపై ఉన్న ఆరోపణలను,
మాఫీ చేయించుకోవడానికి పైకి ఉద్యమం పేరుతో మీడియాలో, పేపర్లో, హడావుడి చేయడం,
లోపాయికారిగా ప్రభుత్వ పెద్దలతో ఒప్పందాలు చేసుకోవడం వీరి యొక్క నైజం అని
విమర్శించారు. అందువల్లా ఈ పరిస్థితులలో ఏపీజేఏసీ అమరావతి ఇచ్చిన పిలుపులో
ఉద్యమమే మొదలు పెట్టకుండా అప్పుడే ప్రభుత్వ పెద్దలు లిఖితపూర్వ హామీ ఇస్తే
ఉద్యమాన్ని ఆపేస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ఎన్నిసార్లు
సి. ఎస్ సమక్షంలో చర్చలు జరిగాయని, ఎన్నిసార్లు మంత్రివర్గ ఉప సంఘం తో
చర్చలు జరిపారని, ఇప్పటివరకు ఏమైనా పరిష్కారం అవడం జరిగిందా ? అని
ప్రశ్నించారు. మరలా ఇప్పుడు లిఖిత పూర్వ హామీ అంటున్నారని, హామీ ఎవరివ్వాలి,
ఎవరిస్తే హామీలు అమలవుతాయి, ఇప్పటికైనా ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడాలంటే, మరలా
అన్ని ఉద్యోగ సంఘాలు ఒక తాటిపైకి వచ్చి గతంలో జరిగిన పరిస్థితులకు భిన్నంగా
అన్ని ఉద్యోగ సంఘాలు కలిపి విజయవాడ నడిబొడ్డులో ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి
సమక్షంలో అన్ని ఉద్యోగ సంఘాలు నాయకులు విజయవాడ కనక దుర్గ అమ్మవారిమీద ప్రమాణం
చేసి, ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అయ్యేవరకు ఉద్యోగుల పక్షాన ఉంటామని,
అప్పటివరకు అవసరమైతే అన్ని జేఏసీల నాయకులు ఆమరణ నిరాహార దీక్ష కైనా వెనకాడమని
ఉద్యోగుల ప్రయోజనమే ముఖ్యమని ప్రమాణం చేయాలనీ డిమాండ్ చేశారు.