పథకాని కి సేద్యం చేసే రైతులందరూ లబ్ధిదారులే
ఆయుష్ ఇన్ఫో సర్వీసెస్ అధినేత మంచూరి సోమశేఖర రావు
విజయవాడ : అన్నదాత కార్డు ద్వారా సన్న, చిన్నకారు రైతులందరూ సకాలంలో
సద్వినియోగం చేసుకోవాలని ఆయుష్ ఇన్ఫో సర్వీసెస్ అధినేత మంచూరి సోమశేఖర రావు
కోరారు. గురువారం విజయవాడ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయుష్ ఇన్ఫో
సర్వీసెస్ అధినేత మంచూరి సోమశేఖర రావు మాట్లాడుతూ దేశానికి రైతే వెన్నెముక అనే
నినాదంతో కేంద్ర ప్రభుత్వంలో ప్రధాని నరేంద్ర మోడీ రైతుల పక్షపాతిగా ఎన్నో
పధకాలను ప్రారభించడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా పి. ఎం కిసాన్ అన్మోల్
క్యాంటీన్ కార్డు పథకం (ఈ-అన్నదాత) రైతుల సహాయ కేంద్రంను ఆంధ్రప్రదేశ్ అంతటా
నిర్వహించటానికి ఆయుష్ ఇన్ఫో సర్వీసెస్ వారు సేవా శాఖ ద్వారా ఆంధ్రప్రదేశ్
రాష్ట్రమంతా ఈ అన్నదాత కార్డులను రైతులకు అందించటానికి కేంద్ర ప్రభుత్వంతో
భాగస్వామ్యం అవటం జరిగిందన్నారు. ఈ అన్నదాత కార్డు పొందిన ప్రతి ఒక్క రైతులకు
రూ. 5 లక్షల వరకు బీమా వర్తిస్తుందని, ప్రమాద భీమా కింద రూ.25 లక్షల వరకు
వర్తిస్తుందని రైతు కిసాన్ కార్డుతో 500 నుండి అంతకంటే ఎక్కువ కొనుగోలు చేస్తే
40శాతం రాయితీ లభిస్తుందని ఇంతేకాక రైతులకు కావాల్సిన మరెన్నో సదుపాయాలను ఈ
అన్నదాత కార్డు ద్వారా సన్న, చిన్నకారు రైతులందరూ సకాలంలో సద్వినియోగం
చేసుకోవాలని ఆయుష్ ఇన్ఫో సర్వీసెస్ అధినేత మంచూరి సోమశేఖర రావు తెలిపారు. ఈ
కార్యక్రమంలో ఆయుష్ ఇన్ఫో సర్వీసెస్ అధికారులు మధు, సుధాకర్, గోవర్ధన్, అరుణ,
కృష్ణ చైతన్య తదితరులు పాల్గోన్నారు.