విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి దళిత ముఖ్యమంత్రి స్వర్గీయ దామోదరం
సంజీవయ్య జయంతి సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయం విజయవాడ ఆంధ్రరత్న
భవన్ లో ఎపిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు సీనియర్ కాంగ్రెస్ నాయకులతో
కలిసి దామోదరం సంజీవయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా రుద్రరాజు మాట్లాడుతూ దామోదరం సంజీవయ్య నీతి నిజాయితీకి
ప్రతిరూపమని, అనేక శాఖలకు మంత్రిగా పనిచేసిన ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజా
పాలనలో తనదైన ముద్రవేశారని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వంలో అనేక పదవులు
అలంకరించి ఆ పదవులకే వన్నెతెచ్చిన మహనీయుడని, నేటి యువత సంజీవయ్య ని ఆదర్శంగా
తీసుకుని అడుగుజాడల్లో నడవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎపిసిసి
కార్యనిర్వాహక అధ్యక్షులు సుంకర పద్మశ్రీ, ఎపిసిసి సమన్వయ కమిటీ సభ్యులు
ఆర్.శ్రీరామమూర్తి, జిల్లా అధ్యక్షులు లామ్ తాంతియా కుమారి, నగర అధ్యక్షులు
నరహరశెట్టి నరసింహరావు, ఎపిసిసి లీగల్ సెల్ చైర్మన్ వి.గురునాధం, ఏఐసిసి
సభ్యులు కొలనుకొండ శివాజీ, ఎపిసిసి ఆర్టీఐ సెల్ చైర్మన్ పి.వై.కిరణ్, ఏపిసిసి
హ్యుమన్ రైట్స్ సెల్ చైర్మన్ మన్నం రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.