విజయవాడ : ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహారదీక్ష చేసి ప్రాణాలర్పించిన
అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్
కార్యాలయం ఆంధ్రరత్న భవన్ నందు కాంగ్రెస్ శ్రేణులు ఆయన చిత్రపటానికి పూలమాల
వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలుగువారి
ఆత్మగౌరవానికి ప్రతీక అయినటువంటి శ్రీ పొట్టి శ్రీరాములు మహాత్మా గాంధీ భావాల
పట్ల ఆకర్షితులై స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొని ఉప్పు సత్యాగ్రహ కాలంలో జైలు
శిక్ష కూడా అనుభవించారని, మద్రాసు ప్రోవిన్సు లోని అన్ని దేవాలయాలలోను
హరిజనులకు ప్రవేశం కల్పించాలని దీక్ష చేసారని, జీవితంలో చిన్న వయసులోనే అనేక
కష్టాలను అనుభవించి గాంధీ అనుయాయిగా సబర్మతి ఆశ్రమంలో చేరి స్వాతంత్య్ర
ఉద్యమంలో పాల్గొన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ కమిటీ
అధ్యక్షులు నరహరశెట్టి నరసింహ రావు, ఎపిసిసి లీగల్ సెల్ చైర్మన్
వి.గురునాధం, ఆర్టీఐ సెల్ చైర్మన్ పి.వై.కిరణ్, మీసాల రాజేశ్వర రావు,
ఏఐసిసి సభ్యులు ఖాజా మొహినుద్దీన్, అన్సారీ, జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు.