విజయవాడ : కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు ఆధ్వర్యంలో ఆంధ్రరత్న భవన్ లో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. పీసీసీ సభ్యులు, సీనియర్ నేతల సమక్షంలో కేక్ కట్ చేశారు. అదే విధంగా స్వామి వివేకానంద జన్మదినం సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఓఎన్జీసీ లో దీర్ఘకాలం పని చేసి, డిప్యూటీ జనరల్ మేనేజర్ హోదాలో పదవీ విరమణ చేసిన పి. ఫణి కాంగ్రెస్ పార్టీలో చేరారు. పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అధిష్టానం ఆదేశాలకు అనుగుణంగా పార్టీ అభివ్రుద్ధికి క్రుషి చేస్తానని ఈ సందర్భంగా ఫణి పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్యనిర్వహక అధ్యక్షులు మస్తాన్ వలి, జంగా గౌతమ్, సుంకర పద్మశ్రీ, ఉపాధ్యక్షులు కొలనుకొండ శివాజీ, ఎస్సీ సెల్ ఛైర్మన్ సాకే శంకర్, ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర అధ్యక్షులు నాగమధు యాదవ్, విజయవాడ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు నరహరి శెట్టి నరసింహారావు పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.