విజయవాడ : రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయం ఆంధ్రరత్న భవన్ నందు భారత మాజీ ప్రధాని
లాల్ బహదూర్ శాస్త్రి వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ఆయనకు నివాళులు
అర్పించారు. ఈ సందర్భంగా విజయవాడ నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నరహరశెట్టి
నరసింహ రావు మాట్లాడుతూ లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానిగా దేశానికీ చేసిన సేవలను
కొనియాడారు. జై జవాన్ – జై కిసాన్ నినాదంతో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా
నిలిచిపోయారని, భారత్ – పాకిస్థాన్ యుద్ధ సమయంలో ప్రధానిగా ముందుండి దేశాన్ని
నడిపించారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎపిసిసి లీగల్ సెల్ చైర్మన్
వి.గురునాధం, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మీసాల రాజేశ్వర రావు, తదితరులు
పాల్గొన్నారు.