విజయవాడ : ప్రముఖ సంఘ సంస్కర్త సావిత్రిబాయి ఫూలే జయంతి కార్యక్రమం మంగళవారం
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర కార్యాలయం ఆంధ్రరత్న భవన్ లో ఘనంగా
నిర్వహించారు. ఈ సందర్భంగా ఎపిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ
సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన సావిత్రిబాయి ఫూలే ఆధునిక విద్య ద్వారానే
స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని గట్టిగా నమ్మారని అన్నారు. సావిత్రిబాయి ఫూలే
భారతదేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలని, తన భర్త అయిన జ్యోతిరావు ఫూలేతో
కలసి 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటగా బాలికల పాఠశాలను ప్రారంభించి మహిళల
విద్యకోసం పాటుపడ్డారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎపిసిసి ముఖ్య అధికార
ప్రతినిధి డా.ఎన్.తులసి రెడ్డి, ఏఐసిసి కార్యదర్శి సిరివెళ్ల ప్రసాద్,
ఎపిసిసి కార్యనిర్వాహక అధ్యక్షులు సుంకర పద్మశ్రీ, రాష్ట్ర కాంగ్రెస్
నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.