ఖేలో ఇండియా పథకంలో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ లో కొత్తగా 12 ఖేలో ఇండియా కేంద్రాల
(కేఐసీ) ఏర్పాటుకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) గ్రీన్ సిగ్నల్
ఇచ్చింది. పార్వతీపురంలో వెయిట్‌లిఫ్టింగ్, పాడేరులో రెజ్లింగ్, అనకాపల్లిలో
బాక్సింగ్, రాజమండ్రిలో ఫుట్‌బాల్, భీమవరంలో రైఫిల్ షూటింగ్, మచిలీపట్నంలో
స్విమ్మింగ్, గుంటూరు, పుట్టపర్తిలో జూడో, బాపట్ల, రాయచోటి, చిత్తూరులో
ఫెన్సింగ్, నంద్యాలలో హాకీ అకాడమీల స్థాపనకు సాయ్ ఆమోద ముద్ర వేసింది.
త్వరలో మొదలయ్యే ఈ 12 ఖేలో ఇండియా కేంద్రాలకు సాయ్ బెంగళూరు కేంద్రం నుంచి
నిధులు విడుదల కానున్నాయని శాప్ ఖేలో ఇండియా కోఆర్డినేటర్ దేవానంద్
తెలిపారు.