కేంద్రం అధ్యయనంలో వెల్లడి
వాయుగుండాలు, తుపానుల వల్ల దేశ సముద్రతీరంపై అలల ఉధృతి
ఇప్పటికే తీర ప్రాంతంలో కోతకు గురైన 3,679.91 హెక్టార్ల భూమి
అండమాన్–నికోబార్ దీవులు, కేరళ, ఒడిశా, తమిళనాడు, గుజరాత్‌పై అలల ఉధృతి అధికం
వీటిలోనే అధికంగా కోతకు గురైన తీర రేఖ
రాష్ట్రంలో కేవలం 15 కి.మీ.ల తీర రేఖపై మాత్రమే అలల ప్రభావం
కేంద్ర జలసంఘం తాజా అధ్యయనంలో వెల్లడి
దేశంలో 1,144.29 కి.మీ.ల పొడవునా కోతకు గురవుతున్న తీరరేఖ
అమరావతి : దేశంలోనే ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం అత్యంత భద్రం, సురక్షితమని
కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) అధ్యయనం స్పష్టం చేసింది. అలల ఉధృతి అధికంగా
ఉండటం వల్ల అండమాన్–నికోబార్ దీవులు, కేరళ, ఒడిశా, తమిళనాడు, గుజరాత్,
కర్ణాటక, మహారాష్ట్రల్లో తీర రేఖ అధికంగా కోతకు గురవుతోందని వెల్లడించింది.
దేశంలో 1,144.29 కి.మీ.ల పొడవునా తీర రేఖ ఎక్కువగా కోతకు గురవుతోందని
తెలిపింది. ఆ తీర ప్రాంతంలో 3,679.91 హెక్టార్ల భూమి తీవ్రంగా కోతకు గురైందని
ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్రంలో 973.7 కి.మీ.ల పొడవైన తీర రేఖ ఉండగా కేవలం
15 కి.మీ.ల పొడవునా మాత్రమే సముద్రపు అలల ప్ర భావం అధికంగా ఉందని
వెల్లడించింది. ఈ నేప థ్యంలో సీడబ్ల్యూసీ అధ్యయన నివేదికను విశ్లేషించిన
పారిశ్రామికవేత్తలు పోర్టులు, హార్బర్ల నిర్మాణానికి, వాటి ఆధారిత పరిశ్రమల
ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ అత్యంత అనువైన ప్రాంతమని చెబుతున్నారు.
దేశంలో రెండో అతి పొడవైన తీర ప్రాంతం మనదే : మన దేశానికి తూర్పున బంగాళాఖాతం,
పశి్చమాన అరేబియా సముద్రం, దక్షిణాన హిందూ మహాసముద్రం సరిహద్దులుగా ఉన్నాయి.
గుజరాత్, మహారాష్ట్ర, గోవా, డయ్యూ డామన్, కర్ణాటక, కేరళ, తమిళనాడు,
పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ప శి్చమ బెంగాల్, లక్షదీ్వప్,
అండమాన్–నికోబార్ దీవుల పొడవున 7,516.6 కి.మీ.ల పొడవైన సుదీర్ఘ తీర రేఖ
ఉంది. దేశంలో అతి పొడవైన తీర రేఖ ఉన్న రాష్ట్రంగా గుజరాత్ (1,214.7 కి.మీ.లు)
మొదటి స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ (973.7 కి.మీ.లు) రెండో స్థానంలో
నిలిచింది.