సంఘాల సమఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావువిజయవాడ : కృష్ణానదీ యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు
చేయటానికి చర్యలు తీసుకోవాలని ఈనెల ౩వ వారంలో హైదరాబాద్ లో జరగనున్న 17 వ
బోర్డు సమావేశంలో ప్రధాన ఎజెండాగా చేర్చిన నేపథ్యంలో దీనిపై స్పందిస్తూ
సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ళ వెంకట
గోపాలకృష్ణారావు నేతృత్వంలో సాగునీటి సంఘాల రాష్ట్ర సారధులు కృష్ణా తూర్పు
డెల్టా ప్రాజెక్టు కమిటీ మాజీ చైర్మన్ గుత్తా శివరామకృష్ణ, నాగార్జునసాగర్ ఎడమ
కాలువ ప్రాజెక్టు కమిటీ మాజీ చైర్మన్ యనమద్ది పుల్లయ్య చౌదరి ఇతర కార్యవర్గ
సభ్యులు ఈరోజు కె. ఆర్.ఎం.బి.చైర్మన్ ఎం.పి.సింగ్ కు పూర్తి వివరాలతో ఈ-మెయిల్
ద్వారా వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఇదే విషయమై సోమవారం విజయవాడ ప్రెస్
క్లబ్ లో పత్రికా విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి పూర్తి వివరాలు తెలియజేశారు.
ఈ సందర్భంగా జలవనరుల శాఖ రాష్ట్ర ఎపెక్స్ కమిటీ మాజీ సభ్యులు, సాగునీటి
వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాలకృష్ణారావు
మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్
లోని కృష్ణానదీ పరివాహక ప్రాంతంలో అన్ని రకాల మానిటరింగ్ చేయటానికి కృష్ణానదీ
యాజమాన్య బోర్డు ఏర్పడిందని ఈ విషయం మీద దీని ప్రధాన కార్యాలయాన్ని
విజయవాడలోనే ఏర్పాటు చేయటానికి 2018 జనవరిలో ఇబ్రహీంపట్నం ప్రాంతంలో భవనాలను
కూడా పరిశీలించటం జరిగిందని అట్లాగే వై.సి.పి. ప్రభుత్వం ఏర్పడినాక జూన్ 2020
లో అప్పటి ప్రభుత్వ ప్రాధానకార్యదర్శి విజయవాడలోనే కె. ఆర్.ఎం.బి. కార్యాలయం
ఏర్పాటు చేయటానికి కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శికి లేఖ రాస్తూ దాని ప్రతులను
కె. ఆర్.ఎం.బి. సభ్యకార్యదర్శి హైద్రాబాదుకు పంపడం జరిగిందని, అలాగే 2019
నవంబరులోను, 2020 ఆగస్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జలవనరుల శాఖ ప్రిన్సిపల్
సెక్రటరీ విజయవాడలోనే కె. ఆర్.ఎం.బి. కార్యాలయం ఏర్పాటు చేయాలనీ కేంద్ర
జలశక్తి శాఖకు లేఖ రాయటం జరిగిందని తెలిపారు. ఇదిలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వం
వీటికి విరుద్ధంగా 2020 డిసెంబరులో కె. ఆర్.ఎం.బి. కార్యాలయాన్ని విశాఖపట్నంలో
ఏర్పాటు చేయాలని కె. ఆర్.ఎం.బి.కి విజ్ఞప్తి చేసి ప్రస్తుతం జరుగబోవు 17 వ
బోర్డు మీటింగులో ఈ అంశాన్ని చేర్చటం చాలా ధారుణమన్నారు.
ఈ సమావేశంలో డిస్ట్రిబ్యూటరీ కమిటీ మాజీ
చైర్మన్ లు, సాగునీటి వినియోగదారుల సంఘాల రాష్ట్ర సమాఖ్య కార్యవర్గ సభ్యులు
ఉప్పలపాటి చక్రపాణి(ప్రకాశం), అంకాళ్ళ ప్రభుదాసు (గుంటూరు), గుండపనేని
శ్రీనివాసరావు, బొర్రా అశోక్ కుమార్ (కృష్ణా) తదితరులు పాల్గొన్నారు.