గుంటూరు : రాష్ట్రవ్యాప్తంగా గురువారం తెల్లవారు జాము నుంచి అవ్వాతాతలు,
వితంతు, దివ్యాంగులతో పాటు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు వైఎస్సార్ పెన్షన్
కానుక పంపిణీ కొనసాగుతుంది. ఇందుకోసం రూ.1,584.87 కోట్లను ప్రభుత్వం విడుదల
చేసింది. గ్రామ, వార్డు సచివాలయాల వారీగా ఆ ప్రాంతంలోని లబ్ధిదారుల సంఖ్య
ఆధారంగా పింఛన్ డబ్బును ప్రభుత్వం ఆయా సచివాలయాల బ్యాంకు ఖాతాల్లో జమ
చేసింది. తెల్లవారుజాము నుంచే వలంటీర్లు నేరుగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి
పింఛన్ డబ్బులు అందజేస్తున్నారు. ఉదయం 7:30 గంటల వరకు 33.29 శాతం పెన్షన్ల
పంపిణీ పూర్తి చేశారు. 20.74 లక్షల మందికి రూ.527.02 కోట్లు అందజేశారు.
సాంకేతిక కారణాలతో ఏ ఒక్కరికీ పింఛన్ అందలేదనే ఫిర్యాదులు రాకుండా ప్రభుత్వం
అన్ని జాగ్రత్తలు తీసుకుంది. పింఛన్ల పంపిణీని ఐదు రోజుల్లోగా నూరు శాతం
పూర్తి చేయాలని ఆదేశించినట్లు డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు పేర్కొన్నారు.