దేశాన్ని ఏకం చేసిన ఘనత సర్దార్ వల్లబాయ్ పటేల్ దే
టీడీపీ జాతీయ కార్యాలయంలో ఘనంగా పొట్టి శ్రీరాములు, సర్దార్ వల్లబాయ్ పటేల్
వర్దంతి
గుంటూరు : దేశంకోసం, ప్రజలకోసం త్యాగాలు చేసిన మహనీయులను స్మరించుకోవటం, మన
బాధ్యత అని వారి పోరాట స్పూర్తితో సమాజహితం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని
టీడీపీ నేతలు అన్నారు. తెలుగు వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు డూండి రాకేష్
ఆధ్వర్యంలో మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో అమరజీవి పొట్టి శ్రీరాములు,
సర్దార్ వల్లభాయ్ పటేల్ ల వర్దంతి సందర్బంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి
టీడీపీ నేతలు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా టీడీపీ నేతలు
మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగ పలితంగానే దేశంలో భాషా
ప్రయక్త రాష్ట్రాల ఏర్పాటుకు నాందిపడింది. నాడు మదరాసీలుగా పిలువడుతున్న
తెలుగువారికి ప్రత్యేక గుర్తింపు ప్రత్యేక రాష్ట్రం కావాలని పొట్టి
శ్రీరాములు ఉద్యమించారు. ప్రజల కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులు పొట్టి
శ్రీరాములు, ఆయన్ను స్మరించుకోవడం తెలుగువారి బాద్యత. ప్రత్యేక ఆంధ్ర
రాష్ట్ర సాధన కొరకు మద్రాసులో 1952 అక్టోబర్ 19న నిరాహారదీక్ష ప్రారంభించి
ప్రాణాలు పోతాయని తెలిసినా భయపడకుండా దీక్ష కొనసాగించి 1952 డిసెంబర్ 15
అర్ధరాత్రి పొట్టి శ్రీరాములు, తన ఆశయసాధనలో ప్రాణాలర్పించి అమరజీవి అయ్యాడు.
ఆయన ప్రాణత్యాగం పలితంగానే కేంద్రం దిగివచ్చి ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు
చేసింది. మహాత్మా గాంధీ బోధించిన సత్యము, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాల కోసం
శ్రీరాములు జీవితాంతం కృషి చేశారు. పొట్టి శ్రీరాములు ఏ ఒక్క కులం, మతం కోసమో
పనిచేయలేదు. కానీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కేవలం తన సామాజికవర్గం వారికే
అధికారం, పదవులు కట్టబెడుతూ మిగతా వర్గాల పట్ల పక్షపాత దోరణి
అవలంభిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలకు న్యాయం జరగాలంటే
తిరిగి చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిని చేయాలని టీడీపీ నేతలు అన్నారు.
సర్దార్ వల్ల బాయ్ పటేల్ దేశ స్వాతంత్య్రం కోసం ఉక్కు సంకల్పంతో పోరాటం చేసి
ఉక్కు మనిషిగా చరిత్రలో నిలిపోయారు. దేశం కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం.
చిన్నచిన్న రాజ్యాలుగా ఉన్న దేశాన్ని తన సమర్థతతో, శక్తియుక్తులతో ఏకం చేసి
అఖండ భారత నిర్మాణం చేసిన చేసిన ఘనత సర్దార్ వల్లభాయ్ పటేల్ కే దక్కుతుంది.
పొట్టి శ్రీరాములు, సర్ధార్ వల్లభాయ్ పటేల్ ల స్పూర్తితో ప్రతి ఒక్కరూ
సమాజహితం కోసం పాటుపడాలని టీడీపీ నేతలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో
టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరావు, వర్ల రామయ్య, ఎమ్మెల్సీలు
పర్చూరి అశోక్ బాబు, ఏ.ఎ.స్ రామకృష్ణ, జాతీయ అధికార ప్రతినిధులు కొమ్మారెడ్డి
పట్టాభిరాం, గురజాల మాల్యాద్రి, పార్టీ జాతీయ కోశాధికారి శ్రీరాం తాతయ్య,
రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్ చార్జ్
కోవెల మూడి రవీంద్ర, పార్టీ రాష్ట్ర కార్యదర్శి చౌటా శ్రీనివాసరావు, జయవరపు
శ్రీరామ్ మూర్తి, రాష్ట్ర కార్వనిర్వాహక కార్యదర్శులు బొద్దూలూరి
వెంకటేశ్వరరావు, బుచ్చి రాం ప్రసాద్, మీడియా కో ఆర్డినేటర్ దారపనేని
నరేంద్రబాబు, గుంటూరు జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షులు వెంకట్రావు, తెలుగు
మహిళా నేతలు అన్నాబత్తుని జయలక్ష్మి, మూల్పూరి సాయికళ్యాణి, టీడీపీ నేతలు
బసుబాబు, కొనకళ్ల సత్యం, వెలివేటి కృష్ణ, పూర్ణచందు, కోటేశ్వరరావు,
గురుప్రసాద్, సాయిరాం, నిర్మల తదితరులు పాల్గొన్నారు.