అభిషేక్ బచ్చన్, నయామి ఖేర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘ఘూమర్’.
భావోద్వేగాలు, స్పూర్తిని కలిగించే ఓ అద్భుతమైన ప్రపంచంలోకి తీసుకెళ్లటానికి
స్పోర్ట్స్ డ్రామాగా ‘ఘూమర్’ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఆర్ బాల్కీ
దర్శకత్వంలో రానున్న ఈ చిత్రంతో అమితాబ్ బచ్చన్ ముఖ్య భూమిక పోషించారు.
శుక్రవారం ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసింది చిత్రబృందం. ‘ఒకే చేతితో ఎవరైన
దేశం కోసం ఆడొచ్చు అనేది లాజిక్. కానీ జీవితం అనే ఆట ఒక మ్యాజిక్ అంటూ అభిషేక్
మాటలతో మొదలైన ట్రైలర్ ప్రేక్షకుల్లో ఆ మ్యాజిక్ ఏమిటో తెలుసుకోవాలనే ఆసక్తిని
రేకెత్తిస్తోంది. అనీనా అనే అమ్మాయి మన దేశం తరఫున క్రికెట్ ఆడటానికి ఎంపికైన
కొద్దిరోజులకే ఒక ప్రమాదంలో తన చేతిని కోల్పోతుంది. మరి ఒకే చేతితో దేశం కోసం
ఆడాలన్న తన కోరిక తీరుతుందా?. ఆమె కల నెరవేరటానికి తన కోచ్ అయిన అభిషేక్ ఎలా
సహాయం చేస్తాడు? అనేది ఈ సినిమాలో చూపించనున్నారు. ‘జీవితంలో ఓడిపోయిన వ్యక్తి
ఎలా బాధపడతాడో నాకు తెలుసు… అలాగే గెలిచిన వ్యక్తి అనుభూతిని కూడా నేను
తెలుసుకోవాలనుకుంటున్నాను అని చివర్లో అభిషేక్ బచ్చన్ చెప్పిన మాటలు
ఉత్కంఠభరితంగా ఉన్నాయి. ఆగస్టు 18న ‘ఘూమర్’ విడుదల కానుంది.