— ఆతిధ్య రంగాన్ని పారిశ్రామిక రంగంగా గుర్తించేందుకు ప్రయత్నం చేస్తాం
— చిన్న స్థాయి హోటళ్ళు కూడా నిలదొక్కుకునేలా చర్యలు
— పర్యాటక రంగానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది…
— విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్
విజయవాడ:
రాష్ట్రంలో హోటళ్ళ రంగాన్ని పారిశ్రామిక విభాగంలో చేర్చేందుకు ప్రభుత్వం కృషి
చేస్తోందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆంధ్ర
ప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ రాష్ట్రస్థాయి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ
కార్యక్రమం నగరంలోని ఒక హోటల్లో గురువారం జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న
ఆయన మాట్లాడుతూ ఈ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం
సిద్ధంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యాటక రంగ అభివృద్ధికి
ప్రత్యేక కార్యచరణ ప్రకటించారని గుర్తు చేశారు. పర్యాటక రంగం అభివృద్ధి
చెందితే తద్వారా హోటల్ రంగం కూడా అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వం
భావిస్తోందన్నారు. గౌరవ అతిధిగా పాల్గొన్న గృహ నిర్మాణ శాఖామంత్రి జోగి రమేష్
మాట్లాడుతూ రాష్ట్రంలో పెద్ద హోటల్స్ తో పాటు చిన్న, మధ్యస్థాయి హోటల్స్
వ్యాపారం కూడా అభివృద్ధి చెందాలన్నారు. ఇందుకు ప్రభుత్వం నుంచి అసోసియేషన్ ఏం
కోరితే అది చేసేందుకు ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. పర్యాటకం,
ఆతిధ్య రంగాల ద్వారా లక్షలాది మందికి ఉపాధి అబిస్తోందన్నారు. ఇటువంటి రంగం
కరోనా తర్వాత వచ్చిన ఇబ్బందులను అధిగమించి ప్రస్తుతం పురోగతి సాధించింద
న్నారు. హోటల్ నిర్వాహకులు కూడా నాణ్యమైన సేవలను అందించాలన్నారు. సామాన్యులకు
సైతం అందుబాటులో ఉండేలా హోటళ్ళను నిర్వహించాలని సూచించారు. ఏ వ్యాపారమైనా
అభివృద్ధి చెందాలంటే వినియోగదారులతో స్నేహపూర్వకంగా వ్యవహరించడం ప్రాథమిక
వ్యాపార లక్షణమన్నారు. ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షులు ఆర్.
వి. స్వామి మాట్లాడుతూ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక, ఆతిధ్య రంగాలను బలోపేతం చేసేందుకు తమ వంతు
సహకారం అందిస్తోందన్నారు. టూరిజం, హోటల్ ఈ రెండు రంగాలు అభివృద్ధి చెందితే
పర్యాటకుల రాక పెరుగుతుందని, మెరుగైన సౌకర్యాల కల్పన ద్వారా ఎక్కువ మందికి
ఉపాధి లభిస్తుందని చెప్పారు. ఊహించని కరోనా ముప్పు అన్ని రంగాలతో పాటు తమ
రంగాన్ని తేరుకోలేని దెబ్బతీసిందని, ఇప్పుడిప్పుడే మళ్లీ కోలుకుంటోందన్నారు.
రాష్ట్ర సమగ్రాభివృద్ధికి తమకు చేతనైనంత మేరకు ప్రభుత్వంతో చేయి చేయి
కలిపేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాలలో
అవకాశాల లోగిలిగా నిలిపేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు.
ప్రధానంగా హోటళ్ల నిర్వహణ సమయం అంశంలో ప్రభుత్వం పునరాలోచించి హోటల్స్
నిర్వాహకుల వ్యాపార అభివృద్ధికి అనుకూలమైన సమయాలను మార్చాలని విజ్ఞప్తి
చేశారు. ప్రభుత్వం రాత్రి వేళల్లో అనుమతించిన ఫుడ్ కోర్టులు రాత్రి 10 గంటల
నుంచి 12 గంటల వరకు నిర్వహించాల్సి ఉండగా ఆయా వ్యాపార నిర్వహకులు రాత్రి ఏడు
గంటల నుంచే వ్యాపారాలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఈ అంశంలో ప్రభుత్వం
వ్యాపారుల సమయాన్ని పటిష్టంగా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. అన్ని హోటళ్లకు
ఒకే పన్ను విధానం అమలు చేసేందుకు ఉన్న అవకాశాలను ప్రభుత్వం పరిశీలించాలన్నారు.

ఎ.పి.హోటల్స్ అసోసియేషన్ నూతన గౌరవ కార్యదర్శిగా, ఎమ్. నాగరాజు, కార్యనిర్వాహక
కార్యదర్శిగా ఎస్. హనుమంతరావు, కోశాధికారిగా పి.వి.పూర్ణచంద్రరావు ప్రమాణ
స్వీకారం చేశారు. హోటల్ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను వినతిపత్రం రూపంలో
ప్రభుత్వానికి ఇదే వేదికపై అందిస్తున్నామన్నారు. తమ సమస్యల పట్ల ప్రభుత్వం
సానుకూలంగా స్పందించాలని ఏపీ హోటల్స్ అసోసియేషన్ తరపున కోరుతున్నామన్నారు.
వేలాది మంది ఉపాధితో పాటు వివిధ రూపాల్లో పన్నులు కూడా చెల్లిస్తున్న ఏకైక
రంగం హోటల్స్ రంగమేనన్నారు. ఈ కార్యక్రమంలో విజయవాడ తూర్పు నియోజకవర్గం
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ దేవినేని అవినాష్, రాష్ట్రంలోని 26
జిల్లాల నుంచి హోటల్ నిర్వాహకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు