డక్కిలి : వెంకటగిరి ఎక్స్ ప్రెస్ న్యూస్ ఫిబ్రవరి 15 :
మాజీమంత్రి నేదురుమల్లి రాజలక్ష్మి గురువారం సాయంత్రం నుండి రాత్రి వరకు పలు గ్రామాలలో తమ కుటుంబంతో, మరియు తమ రాజకీయ సహచర కుటుంబాలకు చెందిన వారు మరణించిన కుటుంబాలను ఓదార్పు మరియు ఆత్మీయ పలకరింపు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కమ్మపల్లి, వెంబులూరు, దేవులపల్లి,మాధవాయపాలెం,మార్ల గుంట,కందులవారిపల్లి, వెంపటావరపల్లి, కుప్పాయపాలెం గ్రామాల్లోరాజ్యలక్ష్మి పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో ప్రజలు, పార్టీ సానుభూతి కుటుంబాలు, ప్రజలు ఆమెకు సాదర స్వాగతం పలికారు. తమతో నడిచిన ప్రతి కుటుంబానికి మేము ఆదుకుంటామన్నారు, అప్పుడు తనకు, తన భర్త నేదురు మల్లి జనార్దన్ రెడ్డికి ప్రజలు నాయకులు ఎంతో విశ్వాసం, మద్దతు ఇచ్చారని ప్రస్తుతం తన బిడ్డ రాంకుమార్ రెడ్డి ఈ ఎన్నికలలో పోటీ చేస్తున్నందున మీ మద్దతు మీ అభిమానాన్ని ఇవ్వాలన్నారు. ఆమె వెంట సీనియర్ నాయకులు చెలికం శంకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ వెలికింటి చెంచయ్య, శ్రీహరికోట కృష్ణయ్య,జెసిఎస్ ఇన్చార్జి చింతల శ్రీనివాసలు రెడ్డి, నర్రావుల వేణుగోపాల్ నాయుడు, మామిడి శ్రీనివాసులు, గోవర్ధన్ నాయుడు, ఎమ్మెల్ నారాయణరెడ్డి, శ్రీహరి రెడ్డి, కోళ్లపూడి వేణుగోపాల్, దువ్వూరు రవీందర్ రెడ్డి, బండి కరుణాకర్ రెడ్డి, రమేష్ రెడ్డి, కోమ్మినేని కోటి తదితరులు ఉన్నారు.