వాగ్దానాలు అమలు చేయకుండా మోసం చేశారు
జగన్ ప్రభుత్వంపై గవర్నర్కు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి
ఫిర్యాదు
విజయవాడ : వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఏపీ గవర్నర్కు ఆంధ్రప్రదేశ్
బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి , సత్యకుమార్, బీజేపీ నేతలు
ఫిర్యాదు చేశారు. పంచాయితీ నిధులు దారి మళ్లింపు, అపరిమితంగా చేస్తున్న
అప్పులపై ఫిర్యాదు చేసినట్లు బీజేపీ నేతలు తెలిపారు గ్రామాలను అభివృద్ధి
చేస్తామని వైసీపీ హామీ ఇచ్చింది. వాగ్దానాలు అమలు చేయకుండా మోసం చేశారు.
కేంద్రం పంచాయతీలకు ఇచ్చిన నిధులను దారి మళ్లించారు. గ్రామాల్లో ప్రభుత్వం
పనులు నిలిపివేశారు. చిన్న చిన్న కాంట్రాక్టర్లకు కూడా బిల్లులు చెల్లించలేని
పరిస్థితి. ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో కొంతమంది కాంట్రాక్టర్లు
ఆత్మహత్య చేసుకున్నారు. ఈ అంశంపై రాష్ట్ర గవర్నర్ను కలిసి పరిస్థితి
వివరించాం. సర్పంచులకు న్యాయం చేయాలని, గ్రామీణ వ్యవస్థను కాపాడాలని కోరాం.
రాష్ట్రంపై ఉన్న అప్పుల భారంపై పదేపదే బీజేపీ ప్రస్తావిస్తూ ఉంది. గడిచిన 4
సంవత్సరాల కాలంలో 7.44 లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చారు. ఎఫ్ఆర్బీఎంకు లోబడి
తీసుకొచ్చిన అప్పు కొంతవరకు ఉంటే ఆ పరిధిలోకి రానివ్వకుండా అనేక విధాలుగా వేల
కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం అప్పులు తెచ్చిందని దగ్గుబాటి పురంధరేశ్వరి ఆగ్రహం
వ్యక్తం చేశారు.
ప్రభుత్వ ఆస్తులను తనఖా పెట్టడం, వివిధ కార్పొరేషన్లు ద్వారా ఆదాయం లేని
వాటిని కూడా ఉన్నట్లుగా చూపించి మరీ అప్పులు తెచ్చారు. బెవరేజ్ కార్పొరేషన్
ద్వారా కూడా మద్యం మీద అప్పులు తెచ్చారు. పేదలకు మద్యం సరఫరా చేసి కుటుంబాన్ని
చిధ్రం చేసి తద్వారా వచ్చే ఆదాయాన్ని చూపి అప్పులు చేయటం దుర్మార్గం. రాజ్యాంగ
బద్ధమైన వ్యవస్థగా గవర్నర్ ఉన్నారు కాబట్టి. వీటిపై స్పందించాలని ఈరోజు ఆయన్ని
కలిసి విజ్ఞప్తి చేశాం. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆస్తులు తనఖా విషయాలపై
కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించని అంశాలు ఎందుకు ప్రస్తావించలేదు. రాష్ట్ర
ప్రభుత్వం మసి పూసి మారేడు కాయ చేసే విధంగా వ్యవహరిస్తుంది. రాష్ట్రంలో ఉన్న
ఆర్థిక స్థితిగతులపై కాగ్ నివేదిక కూడా ఇచ్చింది. ఆ రిపోర్టులో చూస్తే రాష్ట్ర
ప్రభుత్వం తీరు ఎంత అధ్వానంగా ఉందో అందరికీ అర్థమవుతుందని పురందేశ్వరి
మండిపడ్డారు.