రాధేశ్యామ్ డిజాస్టర్ తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ భారీ ఆశలు పెట్టుకున్న
చిత్రం ‘ఆదిపురుష్’. ఈ పౌరాణిక చిత్రం ప్యాన్ ఇండియా స్థాయిలో వివిధ
భాషల్లో జూన్ 16న విడుదల కానుంది. రామాయణం ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ
చిత్రంలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా నటిస్తున్నారు. సైఫ్ అలీఖాన్
రావణుడిగా కనిపించనున్నాడు. బాలీవుడ్ డైరెక్టర్ ఓమ్ రౌత్ దర్శకత్వం వహించారు.
శ్రీరామ నవమిని పురస్కరించుకొని రేపటి నుంచి ఈ చిత్రం ప్రమోషన్స్‌ను
ప్రారంభించబోతున్నారు. సినిమాకు సంబంధించిన మరో పోస్టర్, రిలీజ్ గ్లింప్స్ ను
విడుదల చేయనున్నారు.ఈ క్రమంలో దర్శకుడు ఓం రౌత్, నిర్మాత భూషణ్ కుమార్.. జమ్మూ కశ్మీర్‌లోని
వైష్ణో దేవి ఆలయాన్ని దర్శించుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు జరిపించి
ఆశీస్సులు తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్
చేశారు. విడుదలకు మూడు నెలల ముందే ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తున్న టీమ్,
దేశవ్యాప్తంగా రకరకాల ఈవెంట్స్‌తో సినిమాను ప్రమోట్ చేయడానికి ప్లాన్
చేస్తోంది. కాగా, శ్రీరామ నవమి సందర్భంగా ప్రభాస్ అభిమానులంతా హైదరాబాద్
ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ప్రత్యేక కార్యక్రమం ప్లాన్ చేశారు.