హైదరాబాద్: తెలంగాణ రైతాంగానికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ
లేఖ రాశారు. రుణమాఫీ, కేసీఆర్ రైతు వ్యతిరేక విధానాలపై కార్యాచరణకు
పిలుపునిచ్చారు. రైతుతో రాజకీయం చేయడానికి భారాస బయలు దేరిందని ఆరోపించారు.
రైతు వేదికలను ఇన్నాళ్లు అలంకార ప్రాయంగా ఉంచిన ఆ పార్టీ ఇప్పుడు వాటిని
రాజకీయ వేదికలుగా మార్చడానికి బరి తెగించిందని విమర్శించారు. రైతు రుణమాఫీ
కోసం ఇన్నాళ్లూ మనం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూశాం. చివరి బడ్జెట్ కూడా
ప్రవేశ పెట్టడం అయిపోయింది. ఇక రుణమాఫీ ఉండదన్న విషయంపై స్పష్టత వచ్చేసింది.
రాష్ట్రంలో రుణమాఫీకి అర్హులైన రైతుల సంఖ్య 31 లక్షలు. రూ.20 వేల కోట్ల మేర
మాఫీ చేయాల్సిన ప్రభుత్వం రైతులను నిలువునా మోసం చేసింది. కేసీఆర్ మాటలకు
మోసపోయి అప్పుల ఊబిలో చిక్కిన మన సహచరులు దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యలకు
ఒడిగడుతున్నారు. ధాన్యం సేకరించిన 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బు జమ
చేస్తామని జారీ చేసిన ఆదేశాలు కాగితాలకే పరిమితమయ్యాయి. జూన్ 15 నాటికి
రూ.6,800 కోట్ల మేర బకాయిలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా గత 9 ఏళ్లలో లక్షల
ఎకరాల అసైన్డ్ భూములను పేదల నుంచి ప్రభుత్వం లాక్కుంది. పేద గిరిజన, దళిత
బిడ్డలకు భూములు ఇవ్వడానికి మాత్రం ప్రభుత్వానికి చేతులు రాలేదు. కానీ,
ఎన్నికలు సమీపిస్తుండటంతో పోడు భూముల పట్టాలపై కేసీఆర్ ప్రభుత్వం హడావుడి
మొదలు పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 11.50 లక్షల మంది ఆదివాసీలు పోడు
పట్టాలకు అర్హులని తేలింది. కానీ, కేవలం 4 లక్షల మందికి పట్టాలు ఇచ్చినట్టు
చేసి చేతులు దులుపుకుంది. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పి
కేవలం 10 గంటలు కూడా ఇవ్వడం లేదు. సబ్ స్టేషన్లో లాగ్ బుక్ లే దీనికి
సాక్ష్యం. కాంగ్రెస్ పార్టీ ఈ ఆధారాలను బయటపెట్టడంతో ప్రభుత్వం ఉలిక్కిపడింది.
అందుకే అన్ని సబ్ స్టేషన్లలో లాగ్ బుక్‌లను ప్రభుత్వం వెనక్కు
తెప్పించుకుంది. రైతులను మోసం చేసిన విషయంలో కేసీఆర్ ది ఆల్ టైం రికార్డు.
రైతు వేదికల సాక్షిగా రాజకీయానికి భారాస నేతలు వస్తున్నారు. ఆ రైతు ద్రోహులకు
బుద్ధి చెప్పడానికి ఇదొక సదవకాశం. రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తారో
ప్రశ్నించండి. ధాన్యం డబ్బులు ఎప్పుడు జమ చేస్తారో ప్రశ్నించండి. పోడు భూములకు
పట్టాలు ఎప్పుడు ఇస్తారో ప్రశ్నించండని రేవంత్ పిలుపునిచ్చారు.