శ్రీకాకుళం : శ్రీకాకుళం నగరం పెద్దపాడు సమీపంలో జాతీయ రహదారిపై వరుణ్
మోటార్స్ వెనుక 1.5 ఎకరాల విస్తీర్ణంలో నూతనంగా నిర్మించనున్న వైఎస్ఆర్సీపీ
కార్యాలయ భవన నిర్మాణానికి బుధవారం ఉదయం పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ
డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పద్మప్రియ దంపతులు భూమి పూజ చేశారు. ఈ
కార్యక్రమానికి రెవెన్యూమంత్రి ధర్మాన ప్రసాదరావు, స్పీకర్ తమ్మినేని సీతారాం,
మంత్రి సీదిరి అప్పలరాజు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ధర్మాన కృష్ణదాస్
మాట్లాడుతూ 1.5 ఎకరాల్లో అత్యంత ఆధునికంగా ఈ కార్యాలయాన్ని నిర్మిస్తున్నామని
తెలిపారు. మొదటి దశ పనులు రెండు నెలల్లో పూర్తి చేస్తామన్నారు. 24X7 కాల్
సెంటర్ ఏర్పాటు చేస్తామని, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు,
జిల్లా ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండేలా అన్ని వసతులతో పార్టీ
కార్యాలయాన్ని నిర్మిస్తున్నామని చెప్పారు. జిల్లా నలుమూల నుంచి వచ్చే
నాయకులు, కార్యకర్తలకు ఎల్లవేళలా సదుపాయంగా ఉండేటట్టు ఈ భవన సముదాయాన్ని
తీర్చిదిద్దుతామని అన్నారు. త్వరిత గతిని భవనాన్ని పూర్తిచేసి అతి త్వరలో
పార్టీ కార్యకలాపాలు ఇక్కడి నుంచే ప్రారంభిస్తామని కృష్ణ దాస్ పేర్కొన్నారు. ఈ
కార్యక్రమంలో ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లే కిరణ్ కుమార్, మాజీ కేంద్రమంత్రి
డాక్టర్ కిల్లి కృపారాణి, జడ్పీ చైర్ పర్సన్ పీరియా విజయ, ఎపీ గ్రీనింగ్ అండ్
బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ నర్తు రామారావు, ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్
ఎంఎల్సీ అభ్యర్థి శీతంరాజు సుధాకర్, యువ నాయకులు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య,
తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్, కళింగ కోమటి కార్పొరేషన్
చైర్మన్ అంధవరపు సూరిబాబు, రెడ్డిక కార్పొరేషన్ చైర్పర్సన్ దక్కత లోకేశ్వర్
రెడ్డి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శిమ్మ రాజశేఖర్, ప్రియలక్ష్మి
ఎంటర్ప్రైజెస్ ఎండి బుర్రా ఆదినారాయణ శాస్త్రి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్
ఎంవీ పద్మావతి, డాక్టర్ దానేటి శ్రీధర్, ముద్దాడ బైరాగి నాయుడు, రాజాపు
అప్పన్న, కోరాడ ఆశాలతా గుప్తా, చింతాడ మంజు, సురంగి మోహన్ రావు, మెంటాడ
స్వరూప్, డోల జగన్మోహనరావు, ఎన్ని ధనుంజయరావు, ఇప్పిలి కృష్ణారావు, సురంగి
మోహనరావు, సుంకర కృష్ణ, మెంటాడ స్వరూప్, మార్పు పృథ్వి, తదితరులు పాల్గొన్నారు.