అదనపు కమిషనర్ డాక్టర్ వై.శ్రీనివాసరావు
విశాఖపట్నం : ఆధ్యాత్మిక చింతనతోనే భక్తి భావం పొందుతుందని జీవీఎంసీ అదనపు
కమిషనర్ డాక్టర్ వై శ్రీనివాస్ రావు అన్నారు. శుక్రవారం డాబా గార్డెన్స్
ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని
బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం మూడు రోజులపాటు నిర్వహించనున్న
మహాశివరాత్రి మహోత్సవాల బ్రోచర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్
శ్రీనివాసరావు మాట్లాడుతూ చెడు పై ఎప్పుడూ మంచి గెలుస్తూనే ఉంటుందని అన్నారు.
మంచి దైవంతో సమానమని,ప్రతీ మనిషి లో దైవత్వం ఉంటుందని తెలిపారు. శివరాత్రి
పండుగ సందర్బంగా బ్రహ్మకుమారిస్ ఈశ్వరీయ విద్యాలయం,వి.జే.ఎఫ్ సంయుక్త
ఆధ్వర్యంలో నప్రజలలో భక్తి భావాన్ని పెంపోందించేందుకు ఒక మంచి కార్యక్రమాన్ని
చేపడుతున్నందుకు అలాగే ఈ కార్యక్రమంలో తాను కూడా భాగమైనందుకు చాలా సంతోషంగా
ఉందని తెలిపారు.
బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ప్రతినిధి రమ మాట్లాడుతూ ప్రతీ ఏటా విజేఎఫ్ తో కలసి తాము అన్ని పండగలను ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇలా కలిసి పండుగ నిర్వహించడం ఆనవాయితీగా
మారిందని పేర్కొన్నారు.
సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు, వి జె ఎఫ్ అధ్యక్షులు గంట్ల
శ్రీనుబాబు మాట్లాడుతూ బ్రహ్మకుమారీయ విశ్వరీయ విశ్వవిద్యాలయం, ప్రెస్ క్లబ్
సంయుక్త ఆధ్వర్యంలో గత కోనేళ్లుగా అన్ని పండగలను సంయుక్తంగా
నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ క్రమంలోనే శివరాత్రి పండగను
నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 17 నుంచి 19 వరకు మూడు రోజుల పాటు
విశాఖలో ఈ పండుగను వైభవో పేతంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వైద్యనాథ జ్యోతిర్లింగ
దివ్యదర్శనము, ఆధ్యాత్మిక చిత్ర ప్రదర్శన, ఉపవాస జాగరణ పై అవగాహన కలిగించే
స్టాల్స్ ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. సమావేశంలో బ్రహ్మకుమారీయ
విశ్వరీయ విశ్వవిద్యాలయం ప్రతినిధి శివ లీలా, విజేఎఫ్ ఉపాధ్యక్షులు నాగరాజ్
పట్నాయక్,ట్రెజరర్ పి ఎన్ మూర్తి, కమిటీ సభ్యులు ఎమ్మెస్సార్ ప్రసాద్, ఈరోతి ఈశ్వర
రావు, మాధవ్, గిరి తదితరులు పాల్గొన్నారు.