మధ్యవర్తిత్వ మార్గదర్శకాల తాజా సవరణ ద్వారా ఆన్లైన్ వినియోగదారుల రక్షణపై దృష్టి సారించినట్టు ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ శుక్రవారం తెలిపారు. వివాదాస్పద కంటెంట్‌ను హోస్ట్ చేయడంపై ట్విట్టర్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల నిర్ణయాలకు వ్యతిరేకంగా వినియోగదారులు కలిగి ఉండే ఫిర్యాదులను పరిష్కరించేందుకు అప్పీలేట్ ప్యానెల్లను ఏర్పాటు చేయనున్న నేపధ్యంలో కొత్త నిబంధనలను ప్రభుత్వం నోటిఫై చేయడంతో ఈ వ్యాఖ్య వచ్చింది.
శుక్రవారం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం ముగ్గురు సభ్యుల ఫిర్యాదుల అప్పీలేట్ కమిటీలను మూడు నెలల్లో ఏర్పాటు చేయనున్నారు.