ఐ.పి.ఎస్. (రిటైర్డ్)
“గ్లోబల్ వార్మింగ్” అంశం పై విక్రమ సింహపురి యూనివర్సిటీ నెల్లూరు అసిస్టెంట్
ప్రొఫెసర్ సి. కిరణ్మయి
విజయవాడ : “డిప్లొమా ఇన్ జర్నలిజం” కోర్సు విద్యార్థులతో పాటు, రాష్ట్రం లోని
వర్కింగ్ జర్నలిస్టులకు సి.ఆర్. మీడియా అకాడమీ ఆధ్వర్యం లో ప్రతి శనివారం
నిర్వహిస్తోన్న “ఆన్ లైన్ అవగాహనా తరగతుల్లో” భాగంగా ఈ శనివారం (01-07-23) న
“జర్నలిజం – సమాజం” అనే అంశం పై ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ పూర్వ డి.జి.పి కె.
అరవిందరావు ఐ.పి.ఎస్. (రిటైర్డ్) శనివారం ఉదయం 9నుంచి 10 గంటల వరకు ప్రత్యేక
ప్రసంగం చేస్తారని ఆ సంస్థ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాస రావు ఒక ప్రకటనలో
తెలిపారు. ఇండియన్ పోలీస్ సర్వీసు అధికారిగా వివిధ హోదాల్లో పనిచేసివిశ్రాంత
జీవితం గడుపుతున్న అరవింద రావు ప్రవ్రుత్తి రీత్యా రచయిత అని, సమాజానికి
ఉపయోగ పడే పలు రచనలు ఆయన చేశారని కొమ్మినేని శ్రీనివాస రావు పేర్కొన్నారు.
‘అనంతపురం’ పట్టణానికి చెందిన అరవింద రావు విజయవాడ పోలీస్ కమీషనర్ గా
పనిచేశారని ఆ ప్రకటనలో ఛైర్మన్ పేర్కొన్నారు.
“గ్లోబల్ వార్మింగ్” అంశం పై విక్రమ సింహపురి యూనివర్సిటీ నెల్లూరు
అసిస్టెంటు ప్రొఫెసర్ సి. కిరణ్మయి అదే రోజు ఉదయం 8నుంచి 9గంటల వరకు “
ప్రత్యేక ప్రసంగం ఇస్తారని, జర్నలిజం” కోర్సు విద్యార్థులు, వర్కింగ్
జర్నలిస్టులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ
కార్యక్రమానికి చైర్మన్ గా తాము అధ్యక్షత వహిస్తామని, కోర్సు కో ఆర్డినేటర్
డాక్టర్ ఎల్.వి.కె. రెడ్డి పరిచయ కర్తగా, మీడియా అకాడమీ కంటెంట్ ఎడిటర్ కలమండ
శరత్ బాబు సమన్వయ కర్తగా వ్యవహరిస్తారని చైర్మన్ ఆ ప్రకటనలో తెలిపారు.