ఐజా పుట్టినరోజు సందర్భంగా పలువురికి ఆర్థిక సాయం
విజయవాడ : జనసేన నగర అధికార ప్రతినిధి, ఐజా గ్రూప్ చైర్మన్ షేక్ గయాజుద్దిన్
(ఐజా) పుట్టినరోజు సందర్భంగా గురువారం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళ
కుటుంబాలకు వేలాది రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది. అనారోగ్యంతో
బాధపడుతున్న షేక్ సిలార్ కి పదివేల రూపాయలు ఆర్థిక సాయం ఐజా అందజేశారు. ఇటీవలే
కాలం చేసిన మంగమ్మ కుటుంబానికి 5000 రూపాయలు, శ్రీనివాస్ కి పదివేల రూపాయలు,
అప్పాయమ్మ కి 2000 రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఐజా
మాట్లాడుతూ ఆపన్నులను ఆదుకోవడానికి తన చేతనైన సాయం అందజేయడానికి తాను ఎప్పుడు
ముందుంటానని చెప్పారు. ప్రతి ఏటా ఐజా గ్రూప్ తరపున అనేక సామాజిక సేవా
కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. అలాగే ప్రతి ఏటా తన
పుట్టినరోజు సందర్భంగా ఆపదలో ఉన్నవారికి ప్రత్యేకంగా సాయం అందజేస్తున్నామని
చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు అబ్దుల్ మున్నా , షేక్ ఇస్మాయిల్ ,
షేక్ మన్సూర్ సయ్యద్ అలీ , మహబూబ్ , షేక్ ముసు, మైనార్టీ నాయకులు రియాజ్ ,
ఫిరోజ్ ,చోటు , భాషా తదితరులు పాల్గొన్నారు.