ఎప్పటి నుంచో మోకాలి నొప్పితో బాధపడుతున్నారు ప్రభాస్. కొన్నాళ్లుగా ఆయన సరిగా
నడవలేకపోతున్నారని, పోరాట సన్నివేశాల్లో పాల్గొన్నప్పుడు మరింత ఇబ్బంది
పడుతున్నారని చిత్ర పరశ్రమలో వినికిడి. కొన్నాళ్లు ఆయన ఆయుర్వేదం వాడారు. ఆ
తరువాత వైద్యుల సూచన మేరకు విదేశాల్లో చికిత్స తీసుకున్నా అది తాత్కాలిక
ఉపశమనం మాత్రమే కలిగించిందట. అందుకే శాశ్వత పరిష్కారం కోసం ఆపరేషన్
చేయించుకోవాలని భావిస్తున్నారట. అందుకోసం త్వరలోనే ప్రభాస్ అమెరికా
వెళ్లబోతున్నారని తెలుస్తోంది. ఆపరేషన్ చేయించుకొంటే కనీసం 3 నెలల విశ్రాంతి
తప్పనిసరి. అందుకే చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేసి, అప్పుడు సర్జరీ
చేయించుకోవాలని అనుకుంటున్నారట. ప్రభాస్ పూర్తి చేయాల్సిన ప్రాజెక్టుల్లో
‘సలార్’, ‘కల్కి’ ఉన్నాయి. ఈ అక్టోబరులోగా ఈ రెండు చిత్రాలకు సంబంధించిన
షూటింగులు పూర్తయ్యే అవకాశం ఉంది. ఆ తరువాత ప్రభాస్ ఆపరేషన్ చేయించుకొని, మూడు
నెలలు విశ్రాంతి తీసుకొంటే, 2024 ప్రధమార్థంలో మళ్లీ షూటింగులతో బిజీ అవుతారు.
ప్రభాస్ కోలుకున్న తరువాత మారుతి సినిమాతో పాటుగా, సందీప్ రెడ్డి వంగా
చిత్రాన్నీ పట్టాలెక్కించే అవకాశం ఉంది.