అమెరికా ప్రత్యేక ప్రతినిధి రిచర్డ్ బెన్నెట్
ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ల ఆంక్షలు మానవత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయని
అమెరికా ప్రత్యేక ప్రతినిధి రిచర్డ్ బెన్నెట్ అన్నారు. శుక్రవారం నాడు ఆయన
ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించారు. ఆఫ్ఘనిస్తాన్ లో మహిళలు, బాలికల స్వేచ్ఛపై
తాలిబన్ల నిరంకుష ధోరణి అమానవీయమన్నారు. 2021 ఆగస్ట్ లో ఆఫ్ఘనిస్తాన్ ను
తాలిబాన్ నియంత్రణను తిరిగి తీసుకున్నప్పటి నుండి ప్రభుత్వం కోసం పనిచేస్తున్న
చాలా మంది మహిళలు తమ ఉద్యోగాలను కోల్పోయారన్నారు. ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల తీరు
అత్యంత క్రూరంగా ఉందన్నారు.