యుద్ధంతో రాసిన ప్రేమకథ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన “సీతారామం”లో దుల్కర్
సల్మాన్, మృణాల్ నటన అందరి హృదయాలను హత్తుకుంది. దీంతో మరోసారి ఈ జోడి తెరపై
కనిపిస్తే బాగుండని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. తాజాగా ఈ విషయంపై దుల్కర్
మాట్లాడారు. ఖచ్చితంగా మరోసారి మృణాల్ తో కలిసి నటించే అవకాశముందని తెలిపారు.
నేను మృణాల్ కలిసి నటించిన ‘సీతారామం’ అద్భుతమైన విజయం సాధించింది. కొన్ని
సినిమాలు ఎప్పుడు చూసిన కొత్తగా అనిపిస్తాయి. అలాంటి వాటిల్లో ‘సీతారామం’
ఒకటి. ఇందులో మా ఇద్దరి జోడీని ప్రేక్షకులు ఎంతో ఆదరించారు. మరోసారి మృణాల్ తో
కలిసి ఖచ్చితంగా నటిస్తాను. అయితే మళ్లీ ‘సీతారామం’ లాంటి గొప్ప కథ అయితేనే
ఆమెతో చేయాలి. మనం ఒక ప్రత్యేకమైన కథ కోసం వేచి చూద్దామని మృణాల్ తో ఎప్పుడూ
చెబుతుంటాను అని చెప్పుకొచ్చారు. దీంతో వీళ్లిద్దరూ మరోసారి జంటగా కనిపించడం
ఖాయమని ప్రేక్షకులు భావిస్తున్నారు.