అలనాటి తార మధుబాల 1969లో 36 ఏళ్ల వయసులో మరణించారు. ఫిబ్రవరి 23న గురువారం
ఆమె వర్ధంతి. ఈ రోజు విడుదలైన బాలీవుడ్ స్టార్ దిలీప్ కుమార్ తన ఆత్మకథ దిలీప్
కుమార్: ది సబ్‌స్టాన్స్ అండ్ ది షాడోలో ఏమి రాశారో ఓసారి తెలుసుకుందాం
తన రెండవ భార్య, నటి సైరా బాను “గతాన్ని మర్చిపోయి వర్తమానంలో జీవించే” గుణం
ఎలా కలిగి ఉందో వివరిస్తూ.. దిలీప్ కుమార్ తన ఆత్మకథలో మధుబాలతో తన చివరి
సమావేశాన్ని గుర్తు చేసుకున్నారు. “మా పెళ్లయిన వెంటనే మద్రాసులో ఉంటున్న
సమయంలో మధుబాల నుంచి నన్ను అర్జంట్‌గా చూడాలని వుందంటూ మెసేజ్ వచ్చింది. ఆ
మెసేజ్ గురించి బొంబాయికి తిరిగి రాగానే సైరాకు చెప్పాను. సైరా బాను ఒక్కసారి
ఆమెను కలవాలని పట్టుబట్టింది. ఎందుకంటే మధు బాధలో ఆమె పడింది.” అన్నారు.
అతను ఇంకా ఇలా అన్నారు. “నేను మధు ఇంటికి వెళ్ళినప్పుడు, ఆమె బలహీనంగా
కనిపించడం చూసి నేను బాధపడ్డాను. ఆమె ముఖం పాలిపోయి ఉంది.ఆమె అనారోగ్యాన్ని
చూసి చలించిపోయా…” అంటూ బాధాతప్తహృదయంతో వ్యాఖ్యలు రాశాడు.