‘మా నాన్న సినీ పరిశ్రమలో ఐదు దశాబ్దలుగా ఉంటున్నా ఇప్పటికీ ఆయన మొదటిరోజు
లాగనే ఎంతో ఉత్సాహంగా పని చేస్తారు’ అంటూ తన తండ్రి అనిల్ కపూర్ గురించి
చెబుతూ ఆనందం వ్యక్తం చేసింది సోనమ్ కపూర్. తనకు స్పూర్తి ఆయనేనని, ఒక బిడ్డకి
జన్మనిచ్చిన తర్వాత కూడా సినిమాలో నటించమని ప్రోత్సహిస్తారని ఆమె చెప్పింది.
‘మా నాన్న నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఆయనే నాకు స్ఫూర్తి. నన్ను
ఎప్పుడూ ప్రేరేపిస్తూ ఉంటారు. నేను ఆయ లా ఉండాలని కోరుకుంటున్నాను ఎందుకంటే
నేను కూడా అన్నేళ్లు ఈ సినీరంగంలో ఉండాలనుకుంటున్నాను అని చెప్పింది.
‘వీలైనంతకాలం ఆయన పిల్లలని, ప్రేక్షకులని ,తోటి నటీనటులని తన కళతో, నటనతో
అలరించి మంచి స్థానాన్ని సొంతం చేసుకున్నారు. నేను కూడా ఎప్పుడూ ఆసక్తికరమైన,
విభిన్నమైన పాత్రలు చేస్తూ అభిమానులను అలరించాలనుకుంటున్నాను. ఒక నటిగా సెట్
లో ఉండి పనిచేయడం నాకు చాలా ఇష్టం. అలా ‘కెమెరా ముందు ఉంటూ పనిచేయడంలో ఏదో
తెలియని ఆనందం’ అంటూ వ్యాఖ్యల్ని జోడించింది’. ఈ ఏడాది ఆమె నటించిన ‘బ్లైండ్’
సినిమాకు మంచి స్పందనే లభించింది. వచ్చే ఏడాది ఆమె చేయనున్న రెండు ప్రాజెక్టుల
గురించి మాట్లాడుతూ రాబోయే ఆ రెండు సినిమాల కోసం నేను చాలా ఆసక్తిగా
ఎదురుచూస్తున్నాను. నా వ్యక్తిగత జీవితానికి, నా వృత్తికి సమానంగా సమయం
కేటాయించాలని అనుకుంటున్నాను. నేను కూడా మా నాన్నలా నా సమయాన్ని షెడ్యూల్
చేసుకుంటున్నాను అని తెలిపింది.