గుంటూరు : ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేతకు నెట్వర్క్ ఆస్పత్రులు సిద్ధమవుతున్నాయి. జనవరి 25 నుంచి సేవలు నిలిపివేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పథకం కింద నెట్వర్క్ ఆస్పత్రులకు ఏపీ సర్కారు సుమారు రూ.వెయ్యి కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉంది. గతేడాది డిసెంబర్ 31లోపు బకాయిలు చెల్లిస్తామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హామీ ఇచ్చింది. ఇప్పటివరకు చెల్లించకపోవడంతో సేవలు నిలిపివేయాలని నిర్ణయించినట్టు సమాచారం.