ఏకంగా 90 శాతం కుటుంబాలు ఆరోగ్యశ్రీ పరిధిలోకి
వైద్యం అందించడమే కాదు.. రోగి కోలుకునేవరకు ఆర్థిక సాయం కూడా
అందజేస్తున్నాం
గాంధీజీ స్ఫూర్తితో ప్రతి గ్రామానికి ఆస్పత్రిని నిర్మించాం
ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా పేదల ఇంటికే వైద్యుడు
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని
హైదరాబాదులో ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న మంత్రి
కేంద్ర వైద్య ఆరోగ్య సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్.పి.సింగ్ బాఘెల్‌తో కలిసి
ఆయుష్మాన్ భారత్ పరిధిలోని ఆస్పత్రుల యాజమాన్యాలతో చర్చ
అమరావతి : ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా జగనన్న వడివడిగా అడుగులు
వేస్తున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని తెలిపారు.
హైదరాబాదులోని ట్రిడెంట్ హోటల్లో ఆదివారం కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సహాయ
మంత్రి బాఘెల్ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ కింద సేవలు అందిస్తున్న
ఆస్పత్రుల యాజమాన్యాలతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. కేంద్ర
వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్.పి. సింగ్
బాఘెల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత కేంద్ర మంత్రి బాఘెల్ మాట్లాడుతూ
ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రశంసించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ వైద్య
ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని మాట్లాడారు. ఆమె మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ,
ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఏకంగా 3257 చికిత్సలకు ఉచితంగా వైద్యం
అందజేస్తున్న ప్రభుత్వం ఏపీ ప్రభుత్వమని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్
జగన్ మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏడాదికి ఈ పథకం కింద ఏకంగా రూ.3వేల
కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నామని చెప్పారు. కేంద్రం ప్రభుత్వం గాని,
దేశంలోని ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు గాని ఆయుష్మాన్ భారత్ లాంటి ఆరోగ్య
పథకాల గురించి ఆలోచించడానికి ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న ఆరోగ్యశ్రీ
పథకం మాత్రమే కారణమని మంత్రి తెలియజేశారు. దివంగత ముఖ్యమంత్రివర్యులు
డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ గొప్ప పథకానికి జీవం పోశారని గుర్తు
చేశారు. మహానేత వైఎస్సార్ ఈ పథకాన్ని తీసుకొస్తే జననేత జగనన్న ఈ
పథకాన్ని ఆకాశమంత ఎత్తుకు విస్తరించారని కొనియాడారు. ఈ పథకం కింద
అమలవుతున్న చికిత్సల సంఖ్యను అమాంతం జగనన్న పెంచేశారని తెలిపారు.
ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందించే ఆస్పత్రుల సంఖ్యను కనీవిని ఎరుగని
స్థాయికి పెంచారని పేర్కొన్నారు.
నెట్వర్క్ ఆస్పత్రులను భారీగా పెంచాం
గతంలో ఆరోగ్యశ్రీ, ఆయష్మాన్ భారత కింద కేవలం 1055 ప్రొసీజర్లకు మాత్రమే
ఉచితంగా చికిత్స అందేదని, కానీ ఇప్పుడు ఈ సంఖ్యను తమ ప్రభుత్వం ఏకంగా
3257కు చేర్చిందని వివరించారు. తమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి
చిత్తశుద్ధి కారణంగా తమ రాష్ట్రం లో ఏకంగా 90 శాతం కుటుంబాలు ఆయుష్మాన్
భారత్, ఆరోగ్యశ్రీ పథకం కింద బీమా సౌకర్యం పొందుతున్నాయని వివరించారు.
డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ కింద రాష్ట్రవ్యాప్తంగా
2,275 నెట్ వర్క్ ఆస్పత్రుల ద్వారా ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు
అందజేస్తున్నామన్నారు.
వైద్య రంగంలో సరికొత్త విప్లవం ఆరోగ్య ఆసరా
వైద్యం అందించి అంతటితో రోగులను వదిలేయకుండా వారికి కోలుకునే వరకు తమ
ప్రభుత్వం ఆసరా పథకం పేరుతో ఆర్థిక సాయం అందజేస్తున్నదని చెప్పారు.
రోజుకు రూ.225 చొప్పున రోగికి ఎన్ని రోజులు అవసరమైతే అన్ని రోజుగు
ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తున్నదని వివరించారు. దేశ చరిత్రలోనే
మున్నెన్నడూ చూడని విధంగా, గాంధీజీ ఆశించిన గ్రామస్వరాజ్యం కలలకు ప్రతి
రూపంగా ‘ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు.
గత ఏప్రిల్ నుంచి ఈ కార్యక్రమం ద్వారా పేద ప్రజల ఇళ్ల వద్దకే వెళ్లి
వైద్యులు వైద్య సేవలు అందజేస్తున్నారని వివరించారు. గత టీడీపీ హయాంలో
మందులు, వైద్యులు, ఇతర సిబ్బంది, మౌలిక వసతులు, భవనాల కొరత, ఇలాంటి
సమస్యలన్నిటితో ప్రభుత్వ ఆస్పత్రులు నిరుపయోగంగా మారిపోయాయని విమర్శించారు.
ఇప్పుడు ఆ పరిస్థితి లేదని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 10,032 డాక్టర్
వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్‌లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్
రెడ్డి ఏర్పాటుచేశారని వివరించారు. ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా ప్రతి
పీహెచ్‌సీకి ఇద్దరు వైద్యులను నియమించామని చెప్పారు. ఒక్క వైద్య ఆరోగ్య
రంగంలోనే ఏకంగా నాలుగేళ్లలో 49వేలకు పైగా నియమాకాలు చేపట్టిన ఘనత తమ
ప్రభుత్వానికే దక్కుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 1,11,19,792
మంది ఫ్యామిలీ డాక్టర్ వైద్య విధానం ద్వారా వైద్య సేవలు ఉచితంగా పొందారని
పేర్కన్నారు. కార్యక్రమానికి ఏపీ నుంచి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ
ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.టి. కృష్ణబాబు, డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ
హెల్త్ ట్రస్టు సీఈఓ హరీంధిర ప్రసాద్, ఆరోగ్యశ్రీ ట్రస్టు ఎగ్జిక్యూటివ్
ఆఫీసర్ డాక్టర్ తిరుపతి రావు, నేషనల్ హెల్త్ అథారిటీ అడిషనల్ చీఫ్
ఎగ్జిక్యుటివ్ అదికారి డాక్టర్ బసంత్ గార్గ్ తదితరులు పాల్గొన్నారు.